కూలిగా మారిన 'డాక్టరేట్' అందుకున్న phd లెక్చరర్ !

Update: 2020-09-03 10:10 GMT
కరోనా మహమ్మారి విజృంభణ తో విధించిన లాక్‌ డౌన్ తో అనేకమంది రోడ్డున పడ్డారు. ఉపాధి లేక.. . ఉద్యోగాలు లేక.. ఉన్న ఉద్యోగాలు పోయి కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా  భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయులు కూడా గడ్డుకాలం ఎదురవుతోంది. విద్యాసంస్థలు మూతపడటంతో ప్రైవేట్ ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డారు. కడప జిల్లాలో నూ అదే జరిగింది కరోనా  లాక్‌ డౌన్ దెబ్బకు పీహెచ్డీ లెక్చరర్ బతుకుచిత్రం ఒక్కసారిగా మారిపోయింది.. కుటుంబ పోషణ కోసం కూలి పని గా మారిపోయాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే... కడప జిల్లా ఖాజీపేట మండలం తవ్వారు పల్లె గ్రామానికి చెందిన తవ్వా వెంకటయ్య తెలుగు సాహిత్యంలో పి హెచ్ డి పూర్తి చేసి డాక్టరేట్ అందుకున్నారు.ఆ తర్వాత కాజీపేటలోని ఓ కళాశాలలో లెక్చరర్ గా  పని చేస్తున్నారు. ఈ సమయంలోనే కరోనా మహమ్మారి విజృంభించడంతో విద్యా సంస్థలన్నీ కూడా మూతబడి పోయాయి. దాదాపుగా ఇప్పటికే విద్యాసంస్థలు మూతపడ్డాయి ఆరు నెలల కాలం అయిపోయింది. మళ్లీ ఎప్పుడు తెరుస్తారో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొన్నది... కరొనా సాధారణంగా కాలేజీ మూతపడటంతో యాజమాన్యం జీతం కూడా చెల్లించడం లేదు. దీంతో కుటుంబ పోషణ కోసం పొలంలో కూలి పనులకు వెళ్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ టాప్ డైరెక్టర్ .. హరీష్ శంకర్.. మేము అతనిని సంప్రదించాలి అనుకుంటున్నాము..మరిన్ని వివరాలు ప్లీజ్ అంటూ ట్వీట్ చేశారు.
Tags:    

Similar News