కరోనా కల్లోలంలో దేశ ప్రజల ఆరోగ్యం, వైద్యం, భద్రత మరిచి కొత్త పార్లమెంట్ ను కేంద్రం కట్టవద్దని ఓ సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టుకు ఎక్కారు. కొత్త పార్లమెంట్ (సెంట్రల్ విస్తా) ప్రాజెక్ట్ పనులకు అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రదీప్ కుమార్ యాదవ్ అనే యాక్టివిస్ట్ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.ఈ కరోనా కల్లోలం సమయంలో దేశమంతా లాక్ డౌన్ అమలవుతున్న ఈ తరుణంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరికాదని ఆయన పిటీషన్ లోకోరారు. ఈ ప్రాజెక్ట్ పనులను నిలిపివేసేలా చూడాలని పిటీషన్ దారు కోరారు.
అయితే ఢిల్లీ హైకోర్టు ఇదే పిటీషన్ ను ఈనెల 31న కొట్టివేసింది. ఇది జాతీయ ప్రాజెక్ట్ అని.. నిర్మాణ పనులను ఆపాలనడంలో అర్థం లేదని ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఈ పిటీషన్ దురుద్దేశపూరితమని.. జెన్యూన్ కాదని స్పష్టం చేసింది. నిర్మాణ కార్మికులు సైట్ లో పనులు చేస్తున్నందున ఆపేది లేదని స్పష్టం చేసింది.
దాదాపు 20వేల కోట్లతో కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ పనుల్లో ఉన్న కార్మికులు, కూలీలంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పనిచేస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి. వీరిని ప్రత్యేకంగా ఢిల్లీ శివార్లలోని గ్రామం నుంచి తీసుకొచ్చి వారితో పనులు చేయిస్తున్నారు.
ఈ సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్ కు లోగడ విపక్షాలు.. కొందరు పర్యావరణ వేత్తలు కూడా ఈ ప్రాజెక్ట్ పనులకు అభ్యంతరం తెలిపారు. అయితే వీరి వాదనను అధికార బీజేపీ నేతలు ఖండిస్తూ వస్తున్నారు.