గోవాకు చెందిన ప్రముఖ పెర్ఫ్యూమ్ డిజైనర్ మోనికా ఘర్డే హత్య కేసులో పలు సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసుకు సంబందించిన తాజా సమాచారం ప్రకారం... మోనికా ఘర్డేను హత్య చేసే ముందు హంతకుడు ఆమెకు సుమారు 8గంటలపాటు నరకం చూపించాడట. అక్టోబర్ 6న తెల్లవారుజామున 2.30గంటల ప్రాంతంలో ఆమె హత్య జరిగినట్లు గుర్తించిన పోలీసులు ఈ హత్య ఎలా జరిగింది - దానివెనకున్న కారణాలను తెలుసుకునే క్రమంలో ఈ దారుణ విషయం వెలుగులోకి వచ్చింది. ఇదే సమయంలో మోనికా శరీరం మీద చాలా చోట్ల అతడి పంటిగాట్లు సైతం గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ విషయంలో నిర్ధారణకు నిందితుడిని గోవా దంత వైద్య కళాశాలకు తీసుకెళ్లగా... మోనికా ఘర్డే శరీరంపైన ఉన్న పంటి గాట్లతో అతడి పళ్ల సైజు కూడా సరిపోయినట్లు తేలింది.
అయితే, ఈ విషయాలపై తొలుత పోలీసులకు చెప్పిన హంతకుడు రాజ్ కుమార్ సింగ్... మోనికాది అనుకోకుండా జరిగిన హత్య అని, ఆమెను బ్లాక్ మెయిల్ చేద్దామనే ఉద్దేశ్యంతో ఫోటోలు తీద్దామనే ప్రయత్నించాను తప్ప, ఆమెను హత్య చేయాలని కాదని చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయాలపై తనదైన శైలిలో విచారించిన పోలీసులు అనంతరం ఈ విషయంపై క్లారిటీ సంపాదించారు. మోనికాను పక్కా ప్లాన్ తోనే రాజ్ కుమార్ హత్య చేశాడని.. అంతకంటే ముందు ఆమెకు మొబైల్ లో నీలి చిత్రాలు చూపించి మరీ అత్యాచారం చేశాడని.. ఆ సమయంలో ఆమెను మంచంపై పడుకోబెట్టి కాళ్లూ, చేతులూ కట్టేశాడని తెలిపారు.
కాగా, మూడు రోజుల క్రితం మోనికా ఏటీఎంలను వాడటంతో హంతకుడు రాజ్ కుమార్ సింగ్ ను బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే! తాజాగా ఈ విషయాలు కూడా వెలుగులోకి రావడంతో నిందితుడు రాజ్ కుమార్ సింగ్ పై ఐపీసీ 376 - 392 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/