గత కొంతకాలంగా హైదరాబాద్ పోలీసులు కార్బన్ సెర్చ్ పేరిట తనిఖీ కార్యక్రమాలు చేపట్టటం తెలిసిందే. మెరుపువేగంతో.. అష్టదిగ్బందనం అన్నట్లుగా ఉండే ఈ తనిఖీల కారణంగా పాత నేరస్తుల నుంచి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా అలాంటి తనిఖీ ఒకటి ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టారు.
ఆదివారం తెల్లవారుజామున హటాత్తుగా చేపట్టిన ఈ కార్బన్ సెర్చ్ కొనసాగుతోంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. పోలీసుల తనిఖీల్లో భాగంగా ఇప్పటివరకూ 72మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 32 బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న 72 మందిలో 32 మంది బీహార్ కు చెందిన వారు కావటం గమనార్హం. ఈ కార్బన్ సెర్చ్ లో 200 మంది పోలీసులు పాల్గొన్నారు. ఈ లెక్కన.. ఒకేసారి ఏ పది వేల మంది పోలీసులతో.. భారీ ఎత్తున నగరంలోని అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తే..?