మూడు రోజుల కిందట తునిలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను తగలబెట్టడానికి సంబంధించి పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. అదేసమయంలో ఓ టీవీఛానల్ కూడా కొన్ని ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. దాని ప్రకారం ముఖానికి రుమాళ్లు కట్టుకున్న రౌడీ మూక ఒకటి ఈ భయంకర విధ్వంసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ రౌడీ మూకలో ఇంచుమించు 100 మంది ఉన్నారని... వారంతా ముఖానికి రుమాల్లు కట్టుకుని ఉన్నారని తెలుస్తోంది. వీరు రత్నాచల్ దహనమే లక్ష్యంగా వచ్చి ముందుగానే పక్కా ప్రణాళికతో పెట్రోలు వంటివి తమతో తెచ్చకున్నారని.... భారీ విధ్వంసం సృష్టించే ప్రణాళికతో వచ్చిన వీరు ప్రొఫెనల్స్ అని అనుమానిస్తున్నారు. అయితే... వీరి వెనుక ఉన్నదెవరు... వీరిని తెచ్చిన నాయకుడెవరన్నది తెలియాల్సి ఉంది.
కాగా వీరు స్థానికులు కాదని... ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చినవారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో గతంలో జరిగిన పలు ఘటనల్లోనూ ఈ గ్యాంగ్ ప్రమేయం ఉందని తెలుస్తోంది. విజయనగరం పట్టణంలో గతంలో జరిగిన అల్లర్లలోనూ ఇలాగే ముఖానికి రుమాళ్లు కట్టుకున్న ముఠా రాళ్లదాడులకు, వాహనాల దహనానికి పాల్పడింది. అప్పుడు కూడా వారు ఇతర జిల్లాలకు చెందినవారన్న ఆధారాలు లభించాయి.
ఈ ముఠా అల్లర్లు రేపడం... రాళ్లదాడులు, తగలబెట్టడాలు వంటివాటిలో ఆరితేరిన ముఠా అని... తమను గుర్తు పట్టకుండా ఉండేందుకు ముఖాలకు రుమాళ్లు కట్టుకుంటారని చెబుతున్నారు. దాడుల అనంతరం పోలీసుల విచారణలో కెమేరాల్లో దృశ్యాలు చూసినా కూడా వీరిని గుర్తించడం కష్టం. మొన్నటి అల్లర్లు వీరి వల్లే జరిగాయని తెలుస్తుండడంతో వీరిని ఈ పనికి పురమాయించెందవరన్నది దర్యాప్తు చేస్తున్నారు. మున్ముందు కూడా రాష్ట్రంలో సభలు, సమావేశాలు జరిగితే ఇలాంటి రుమాలు రౌడీలతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.