విడిచిన బాణం.. జారిన నోటి మాట వెనక్కి తీసుకోలేం. ఇప్పుడు టీడీపీ సీనియర్ నాయకురాలు - మాజీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమార్ కూడా నోరుజారి చిక్కుల్లో పడిపోయారు. అమెను అరెస్ట్ చేసేందుకు దళిత సంఘాలు ఉద్యమించడం.. వైసీపీ ఎమ్మెల్యే ఏకంగా నేతృత్వం వహించి పోరుబాట పట్టడం చూస్తే నన్నపనేని అరెస్ట్ ఖాయమని అర్థమవుతోందని పరిశీలకులు భావిస్తున్నారు..
చలో ఆత్మకూరు సందర్భంగా టీడీపీ మహిళా నేత నన్నపనేని నోరుజారారు. ఆమెను అరెస్ట్ చేసేందుకు వచ్చిన దళిత ఎస్ఐ అనురాధపై దురుసుగా ప్రవర్తించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది వీడియోల్లో రికార్డ్ అవ్వడంతో వైరల్ అయ్యింది. దీనిపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. నన్నపనేనిని అరెస్ట్ చేయాలంటూ తాజాగా దళిత సంఘాలు మంగళగిరిలో ర్యాలీ తీశాయి. ఈర్యాలీకి వైసీపీలో కీలక నేతగా ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నేతృత్వం వహించడం రాజకీయంగా సంచలనంగా మారింది.
ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం డీజీపీని కలిసి దళిత సంఘాలు వినతిపత్రం అందజేశాయి.. నన్నపనేని రాజకుమారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. మహిళా దళిత ఎస్సైపై వ్యాఖ్యలు చేసిన ఆమెపై చర్య తీసుకోవాలని కోరారు..
వైసీపీ ప్రభుత్వంలో ఉండడం.. దళితులను టీడీపీ నేత తిట్టడం.. వైసీపీ ఎమ్మెల్యేనే ప్రతిపక్ష టీడీపీ నేతపై పోరుబాట పట్టడంతో రాజకీయంగా ఇది హాట్ టాపిక్ గా మారింది. దీన్ని బట్టి త్వరలోనే నన్నపనేని అరెస్ట్ ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చజరుగుతోంది.