తుని ఇష్యూలో ‘300’ మందా?

Update: 2016-02-04 05:55 GMT
కాపుల్ని బీసీల్లో చేర్చాలంటూ ఆదివారం తూర్పుగోదావరి జిల్లా తునిలో నిర్వహించిన కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటు చేసుకున్న హింసాకాండకు సంబంధించి ఏపీ పోలీసులు కీలక అంశాల్ని సేకరించారా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. తుని హింసాకాండలో 300 మంది నిందితుని గుర్తించినట్లుగా చెబుతున్నారు.

దాడుల విషయంలో స్పెషలిస్ట్ లు అయిన కొందరు పాతనేరస్తులు ఈ ఘటనలో పాలు పంచుకున్నట్లుగా భావిస్తున్నారు. తుని ఇష్యూకి సంబంధం ఉందని భావిస్తున్న 300 నిందితులపై కేసులు నమోదుచేయటంతో పాటు.. మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు చెబుతున్నారు.  ఈ ఉదంతంపై మరిన్ని ఆధారాలు సేకరించేందుకు వీలుగా ప్రత్యేక ఫోన్ నెంబరును పోలీసు శాఖ సిద్ధం చేసింది.

తుని ఇష్యూకి సంబంధించి ఏదైనా సమాచారం ఉన్నా.. ఆధారాలు ఉన్నా అందించేందుకు వీలుగా ఒక నెంబరును సిద్ధం చేశారు. తుని హింసాకాండకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు 9440904859 నెంబరుకు కానీ..tunimeeting@gmail.com మొయిల్ చేయాలని చెబుతున్నారు. ఎవరు ఎలాంటి సమాచారం అందించినా రహస్యంగా ఉంచుతామని.. వివరాలు బయటకు వెల్లడించమని అధికారులు చెబుతున్నారు. మరి.. దీనికి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
Tags:    

Similar News