ఏపీ సీఎం చంద్రబాబునాయుడి సొంతూరు నారావారిపల్లె పోలీసులతో నిండిపోయింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఉన్న ఈ గ్రామంలో స్థానికుల కంటే పోలీసులే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎస్సీల వర్గీకరణ డిమాండ్ ఈ గ్రామం నుంచి ఉద్యమం ప్రారంభిస్తానని ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ ప్రకటించిన నేపథ్యంలో మూడు రోజులుగా ఇక్కడ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కాగా ఈ ఉద్యమంపై ప్రకటించిన తరువాత రెండు రోజుల కిందటే మంద కృష్ణమాదిగను అరెస్టు చేశారు. దీంతో ఇక్కడి నుంచి ప్రారంభిస్తామన్న యాత్రకు బ్రేక్ పడింది. అయితే.... అనంతరం సుమారు 135 మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్లలపై పోలీసులు కేసులు నమోదు చేయడంతో అది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో అన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా పోలీసులు నారావారిపల్లెలో భారీగా మోహరించారు.
నారావారిపల్లెలో అణువణువు పోలీసుల ఆధీనంలోనే ఉంది. ఆ గ్రామం మీదుగా వెళ్లే వాహనాలను కూడా పూర్తిగా సోదా చేశాకే పంపిస్తున్నారు. తిరుపతి అర్బన్ ఎస్పీ - 8 మంది డీఎస్పీలు - 500 మంది పోలీసులు అక్కడ తిష్ఠ వేశారు. ఈ స్థాయిలో పోలీసులు మోహరించడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. చంద్రబాబు సొంతూరులో ప్రజలున్నారా పోలీసులున్నారా అన్నట్లుగా అక్కడి పరిస్థితి ఉంది.