హత్రాస్ మత మార్పిడిలో భారీ ట్విస్ట్!

Update: 2020-10-24 11:51 GMT
హత్రాస్ దళిత యువతిపై హత్యాచారం దేశాన్ని ఉడికించింది. దీంతో మన స్థాపం చెందిన ఆ దళిత కులానికి చెందిన వారు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. బాధిత కరెరా గ్రామానికి చెందిన 236మంది వాల్మీకి కులస్థులు బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అంబేద్కర్ మనవడు రాజారత్నం సమక్షంలో వీరంతా బౌద్ధమతంలోకి మారారు.

ఈ క్రమంలోనే మతం మారిన నాటి నుంచి తమను పోలీసులు వేధిస్తున్నారని.. ఆ వాల్మీకి కులస్థులు ఆరోపిస్తుండడం సంచలనంగా మారింది. మీడియా కెమెరాల ముందుకొచ్చి మతం మారలేదని చెప్పాలంటూ పోలీసులు తమపై ఒత్తిడి తెస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

తాజాగా పోలీసులు వేధించారంటూ పవన్ (27) అనే వాల్మీకి సామాజకవర్గానికి చెందిన వ్యక్తి ఆరోపించాడు. మతం మారినట్లు వచ్చిన వార్తలు ఫేక్ అని.. వట్టి వదంతులు అని చెప్పాలంటూ నన్ను ఒత్తిడికి గురిచేశారని పవన్ ఆరోపించారు. అయితే ఆ స్టేట్ మెంట్ ఇచ్చేందుకు తాను నిరాకరించానని పవన్ ఆరోపించారు.

పోలీసులు పవన్ ఆరోపణలను ఖండించారు. కేవలం వారి భద్రత కోసం గ్రామంలో పోలీసులను మోహరించామని.. అంతే తప్ప ఎవరిని ఏ విషయంలోనూ ఒత్తిడి చేయట్లేదని చెప్పాడు.

పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో భారీ ఎత్తున పోలీసులు గ్రామంలో మోహరించారు. గ్రామంలో ఇంకెవరు మత మార్పిడి చేయకుండా అడ్డుకుంటున్నారని వాల్మీకి వర్గం చెబుతోంది.

అయితే పోలీసులు మాత్రం భద్రత కోసమే ఇక్కడ మోహరించామని చెబుతున్నారు. వాల్మీకి వర్గం ఆరోపణలను ఖండించారు. దీంతో మరోసారి హత్రాస్ బాధిత గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది.
Tags:    

Similar News