కాంగ్రెస్ నుంచి హుజూరాబాద్ బరిలో ఇతడే

Update: 2021-07-14 04:42 GMT
తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.  హుజూరాబాద్ కేంద్రంగా రాజకీయం నడుస్తోంది. కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ తో మరోసారి హీటెక్కింది. హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ రాకముందే అభ్యర్థులు యుద్ధానికి రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ఖాయంగా.. టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య ఇన్నాళ్లు కౌశిక్ రెడ్డి దోబూచులాడాడు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరిపోయాడు.

ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి ఆడియో లీక్ లు ఇప్పుడు తెలంగాణ రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ కు కౌశిక్ గుడ్ బై చెప్పాల్సి వస్తోంది. దీంతో కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలోకి దిగుతారనే సస్పెన్స్ కొనసాగుతోంది. టీఆర్ఎస్ తో సన్నిహితంగా ఉంటూ టైం చూసి కాంగ్రెస్ ను దెబ్బకొట్టారు హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్ లో టీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారన్న విషయం తేటతెల్లమైందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భావిస్తున్నాడట.. ఈ క్రమంలోనే పార్టీలో వారిని గుర్తించి ఏరివేయడంతోపాటు ఇక నుంచి వారి పట్ల కటినంగా వ్యవహరించేలా శ్రేణులకు సంకేతాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడట..

ఇటీవలే పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీని గట్టి పోటీనిచ్చేలా చేయాలని ప్లాన్ చేశాడు. తనకు సన్నిహితుడైన కౌశిక్ రెడ్డిని గెలిపించాలని అనుకున్నాడు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఉంటుందనే సమయంలో టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంట్రీతో త్రిముఖ పోరు ఖాయం అనుకున్నారంతా.. కౌశిక్ హ్యాండ్ ఇవ్వడంతో ఇప్పుడు రేవంత్ సీనియర్ అయిన పొన్నం ప్రభాకర్ ను దించాలని భావిస్తున్నారట..

హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరుఫున పొన్నం ప్రభాకర్ పోటీచేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన ప్రచారం చేస్తున్నారు. కానీ ఇంతకుముందే కౌశిక్ రెడ్డి వర్గంతో గొడవ జరగడంతో ఇప్పుడు రాజకీయాలు వేడెక్కాయి. ఆడియో టేపుల కలకలం.. వివరణ కోరడం చకచకా జరిగిపోయాయి. ఇంతలోనే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఇక పొన్నం ప్రభాకర్ కు లైన్ క్లియర్ అయ్యింది. ఇంతకుముందు కౌశిక్ రెడ్డి అడ్డుకోగా.. ఇప్పుడు ఆ అడ్డు తొలిగిపోయింది.

నిజానికి హుజూరాబాద్లో ఈసారి బీసీ మంత్రి పఠిస్తున్నారు. హుజూరాబాద్ నుంచి బీజేపీ తరుఫున ఈటల రాజేందర్  పోటీచేయడానికి సిద్ధం కావడంతో ఆయనకు పోటీగా బీసీలనే నిలబెడుతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం కౌశిక్ రెడ్డిని పోటీచేయించేందుకు ఇష్టపడలేదు.  ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి కూడా కాంగ్రెస్ పై నమ్మకం లేకుండా పోయారు. పీసీసీ చీఫ్ కాగానే రేవంత్ ను కౌశిక్ కలిసినా సరైన హామీ లభించలేదట.. ఈ క్రమంలోనే సీనియర్, బీసీ అయిన పొన్నం ప్రభాకర్ హుజూరాబాద్ లో యాక్టివ్ కావడంతో కౌశిక్ రెడ్డి సీరియస్ అయ్యారు. దీనిపై నిరసనలు తెలిపాడు. పొన్నంకే కాంగ్రెస్ సీటు అని ప్రచారం జరగడంతో టీఆర్ఎస్ వైపు కౌశిక్ మొగ్గు చూపారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు.

హుజూరాబాద్ లో ఇప్పుడు బీసీ కార్డ్ నినాదం నడుస్తోంది. కౌశిక్ రెడ్డికి టికెట్ ఇవ్వాల్సి వస్తే.. ఓసీకి టికెట్ ఇవ్వాలి. అదే బీసీ కార్డ్ ఉన్న పొన్నంకు ఇస్తే సమీకరణాలు కలిసి వస్తాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు. అందుకే కౌశిక్ కంటే పొన్నంనే సరైన క్యాండిడేట్ గా రేవంత్ భావించారు.

హుజూరాబాద్ లో ఎస్సీ, ఎస్టీ , బీసీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. వారిని ప్రసన్నం చేసుకోవడం అంటే.. పొన్నం ప్రభాకర్ కు టికెట్ ఇవ్వడమే మేలు అని భావించారు. అందుకే కౌశిక్ రెడ్డికి పొగ బెట్టారని ప్రచారం జరుగుతోంది.
Tags:    

Similar News