ప్రెస్ కబ్ల్ లో మీడియా అడిగిన ఆ ప్రశ్నకు పోసానికి మింగుడుపడలేదట!?

Update: 2021-09-29 04:30 GMT
తెలుగు రాష్ట్రాల్లో తిట్ల రాజకీయాలను మరో స్థాయికి తీసుకెళ్లిన ఘనత పోసాని క్రిష్ణ మురళీదే అవుతుంది. సభ్యత.. సంస్కారం అన్నింటిని వదిలేసి.. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడేందుకు ఆయన సంధించిన బూతు అస్త్రాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మనకు నచ్చని పని జరిగినప్పుడు.. కోపం వచ్చినప్పుడు.. ఆగ్రహాన్ని వ్యక్తం చేయాలన్నప్పుడు నోట్లో నుంచి తీవ్రమైన మాటలు కొందరికి వస్తే.. మరికొందరికి బూతులు అన్యాపదేశంగా వస్తాయి. ఇది కామన్. కానీ.. ప్రెస్ మీట్ లో తలా తోకా లేకుండా ఇష్టారాజ్యంగా.. వినలేని రీతిలో బూతులు తిట్టేసే వైనం అక్కడోళ్లకు మాత్రమే కాదు.. దాన్ని లైవ్ లో వింటున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యే పరిస్థితి.

ఒక వ్యక్తి మీద కోపం ఉండొచ్చు. అంత మాత్రానికే మరీ ఇంత దారుణంగా తిట్టేయొచ్చా? అన్నది ప్రశ్న. పవన్ పై తాను చేసిన దారుణ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా పవన్ అభిమాని తన భార్య మీద ఏదో అన్నారంటూ ప్రెస్ మీట్ పెట్టిన పోసాని.. ఆ కారణాన్ని చూపించి నోటికి వచ్చినట్లుగా తిట్టేయేటం ఎంతవరకు సబబు? వ్యక్తిత్వ హననానికి పాల్పడిన పోసాని.. పవన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్ని ప్రస్తావించారు.

రాజకీయంగా వంద ఉండొచ్చు కానీ.. ఇంట్లో ఆడోళ్లను తీసుకొస్తామా? అంటూ మాట్లాడిన పోసానికి.. ప్రెస్ క్ల బ్ లోని మీడియా వారు అడిగిన ఒక ప్రశ్న లైవ్ లో రాలేదు. కానీ.. అక్కడి ఆ ప్రెస్ మీట్ ను కవర్ చేస్తున్న వారు సైతం ఆగ్రహం వ్యక్తం చేసేలా వ్యవహరించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంట్లో మహిళల గురించి మాట్లాడతారా? పర్సనల్ మ్యాటర్స్ తీసుకొస్తారా? అన్న పోసానికి.. మరి పలు సందర్భాల్లో వైసీపీ అధినేత జగన్..పవన్ మూడు పెళ్లిళ్ల గురించి వ్యాఖ్యలు చేశారు కదా? మరి.. అది వ్యక్తిగత విషయం కాదా? అలాంటప్పుడు వ్యక్తిగత విషయాన్ని ఎందుకు మాట్లాడతారు? అంటూ జగన్ మీద మీరెప్పుడు విరుచుకుపడలేదే? అన్న ప్రశ్నను ఒకరు సంధించారట.

దీంతో చెలరేగిపోయిన పోసాని.. నీకు ఇష్టపమైతే కవర్ చేయ్.. లేదంటే నా ప్రెస్ మీట్ ను బాయ్ కాట్ చేయాలంటూ ఫైర్ అయ్యారట. దీంతో.. అప్పటివరకు పోసాని వ్యాఖ్యలన్ని ఆయన వ్యక్తిగత ఆవేశానికి గురై వచ్చినవే అనుకున్న వారు సైతం.. మొత్తం ఎపిసోడ్ పైన అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారట.
Tags:    

Similar News