నిర్మలమ్మ బడ్జెట్ పెట్టేశారు. అందరూ ఎంతో ఆశగా చూసిన బడ్జెట్ సామాన్యుడికి.. ఒక మోస్తరు చదువుకున్న వారికే కాదు.. మీడియాలో పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చిన వారికి సైతం ఒక పట్టాన వంట పట్టింది లేదు. మాట్లాడుకోవటానికి వీలుగా లేని ఈ బడ్జెట్ అంతా కూడా.. ఏదో ఉంది కానీ ఏమీ అర్థం కాలేదన్నట్లుగా అనిపించటం.. జనమంతా ఆసక్తిగా మాట్లాడుకునే అంశాలు పెద్దగా లేకపోవటంతో.. బడ్జెట్ బాగోలేదన్న భావన వ్యక్తమయ్యేలా చేసింది. అయితే.. నవతరానికి వేసే బాటకు కేరాఫ్ అడ్రస్ గా తాజా బడ్జెట్ ఉందని మాత్రం చెప్పాలి. డిజిటల్ భారత్ ను ఆవిష్కరించేందుకు వీలుగా పెద్ద పీట వేసిన ఈ బడ్జెట్ పుణ్యమా అని పెరిగే వస్తువులు ఏమిటి? తగ్గేవి ఏమిటి? అన్నది ఆసక్తికరమైన అంశం. ఆ వివరాల్లోకి వెళితే..
ముందుగా తగ్గేవాటి కంటే పెరిగే వాటిని చూస్తే.. మన మీద భారం పడే జాబితా ఎంత ఉందన్నది అర్థమవుతుంది. రోజువారీ జీవితంలో ఈ వస్తువులు వాడకపోతే కష్టమన్నవేమీ ధరలు పెరిగే జాబితాలో లేకపోవటం కాస్తంత రిలీఫ్ కలిగించేది గా చెప్పాలి. కాకుంటే.. సామాన్యుడి నుంచి సంపన్నుల వరకు అందరు వాడే గొడుగుల ధరలు పెరిగేలా నిర్ణయం తీసుకోవటం మాత్రం కాసింత ఆశ్చర్యానికి గురి చేసేదిలా ఉందని చెప్పాలి. ఇక.. బంగారు ఆభరణాల్ని కొనే పరిస్థితి మామూలు వారికి లేక.. వాటిలా ఉండే ఇమిటేషన్ జ్యువెలరీ మీద భారం మోపేలా నిర్ణయం తీసుకోవటం కాసింత ఇబ్బంది. ఇవి తప్పించి.. పెద్దగా ఫీలయ్యేవి లేవనే చెప్పాలి. ఇంతకీ ఆ జాబితాను చూస్తే..
- ఇంపోర్టెడ్ హెడ్ ఫోన్స్
- ఇయర్ ఫోన్స్
- లౌడ్ స్పీకర్లు
- స్మార్ట్ వాచ్ లు
- స్మార్ట్ బ్యాండ్స్
- స్మార్ట్ మీటర్లు
- ఇమిటేషన్ జ్యువెలరీ
- ఇయర్ బడ్స్
- విదేశీ గొడుగులు
- సోలార్ మాడ్యూల్స్
- ఎక్స్ రే మిషన్లు
- అన్ బ్లెండెడ్ పెట్రోల్.. డీజిల్
- ఎలక్ట్రిక్ బొమ్మల విడి భాగాలు
ధరలు తగ్గేవి ఏమంటే..
- డ్రెస్సులు
- లెదర్ గూడ్స్
- మొబైల్ ఫోన్లు
- ఫోన్ ఛార్జర్లు
- ఇంపోర్టెడ్ కట్ అండ్ పాలిష్డ్ డైమండ్స్
- బంగారు వెండి ఆభరణాలు
- నిల్వ చేసిన నత్తగుల్లలు.. ఇతర మాంసాహారం
- కోకో బీన్స్
- మిథైల్ ఆల్కహాల్
- ఇంగువ
- పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమయ్యే కొన్ని రసాయనాలు
- మొబైల్ ఫోన్ల కెమెరా లెన్స్ లు
- స్టీల్ స్క్రాప్
- ఎసిటిక్ యాసిడ్