రాజకీయ భద్రతా కండోమ్ లు.. ఎమ్మెల్యేల కొనుగోళ్లు.. ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు
బీజేపీ అంటేనే ఒంటికాలిపై లేచే వ్యక్తుల్లో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఉంటాడు. తాజాగా తెలంగాణలో బయటపడ్డ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంపై ఆయన ఘాటుగా స్పందించాడు. ఈ వ్యవహారం తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న నేపథ్యంలో బీజేపీపై విరుచుకుపడ్డారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అలజడి సృష్టించడం బీజేపీకి అలవాటుగా మారిందని ప్రకాష్ రాజ్ విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ చేసిన పనే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనూ చేస్తున్నారని ప్రకాష్ రాజ్ నిప్పులు చెరిగారు.
ఆ దొంగలకు పనిలేదని పేర్కొన్న ప్రకాష్ రాజ్, ఇక్కడ కొత్తగా ఏమీ చేయలేదని.. కర్ణాటక, మహారాష్ట్ర ఇలా అన్ని చోట్ల వారు ఇలానే చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తించాలని ప్రకాష్ తెలిపారు.
బీజేపీనో, మోడీనో కాదు.. ఎవరు ఇలాంటి పనిచేసినా ప్రజలు, మీడియా ప్రశ్నించాలని పేర్కొన్న ప్రకాష్ రాజ్ ఇది తన అభిప్రాయం అని ప్రకాష్ రాజ్ అన్నారు. ఇక సోషల్ మీడియా వేదికగానూ ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ సంచలన ట్వీట్ చేశారు.
ఎమ్మెల్యేల కొనుగోళ్లకు యత్నించిన బీజేపీని టార్గెట్ చేసిన ఆయన వారు రాజకీయ భద్రత కండోమ్ లను విక్రయిస్తున్నారా? అంటూ సంచలన ట్వీట్ చేశారు. సిగ్గులేని బీజేపీ ఎంతగా దిగజారిపోతుందో అంటూ మరో ట్వీట్ లో ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.
ఇలా బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న కేసీఆర్ స్ట్రాంగ్ గా ఉండాలని ప్రకాష్ రాజ్ సూచించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని చూస్తే సంతోషంగా ఉంటుందని చెప్పిన ప్రకాష్.. కేసీఆర్, కేటీఆర్ ఆలోచనలు తనకు ఎంతో ఇష్టమన్నారు. వారు కూడా తనను ఎంతో గౌరవిస్తారని చెప్పారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంట ఉంటారని ప్రకాష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.