హెల్ప్‌లైన్‌ కు ఫోన్ చేసి స‌మోసాలు ఆర్డ‌ర్ ... పోలీసులు ఏంచేశారంటే ?

Update: 2020-03-31 23:30 GMT
క‌రోనా వైర‌స్‌ ప్రస్తుతం ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి ధాటికి ప్రపంచ వ్యాప్తంగా వేల సంఖ్య‌లో మృత్యువాత ప‌డ‌గా.. ల‌క్ష‌ల్లో కరోనా బాధితులు ఉన్నారు. క‌రోనా క‌ట్ట‌డి చేయడానికి కేంద్రం 21 రోజుల పాటు దేశ వ్యాప్త లాక్‌ డౌన్ ను విధించిన సంగ‌తి తెలిసిందే. ఇక క‌రోనా వైర‌స్ త‌మ‌కు సోకింద‌ని ప‌లువురు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతుండ‌డం తో ప్ర‌జ‌ల కోసం హెల్ఫ్‌ లైన్లు ఏర్పాటు చేశారు. ఇక పోలీసులు అయితే తమ ప్రాణాలని సైతం పనంగా పెట్టి , కుటుంబాలకి దూరంగా ఉంటూ డ్యూటీలు చేస్తున్నారు.

ఏదైనా ప్రజలకి అత్యవసరం వస్తే ..అప్పుడు త్వరగా రియాక్ట్ అవ్వడాన్ని హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తే .. కొంద‌రు ఆక‌తాయిలు ఆ హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేసి పోలీసులతో ఆడుకుంటున్నారు. తాజాగా ఓ ఆక‌తాయి.. క‌రోనా హెల్ప్‌ లైన్ సెంట‌ర్‌ కు కాల్ చేసి స‌మోసాలు ఆర్డ‌ర్ ఇచ్చాడు. లాక్‌డౌన్ వల్ల షాపులు మూసి ఉన్నాయని తెలిపాడు. అలాంటి సేవలను హెల్ప్‌ లైన్‌ లో చేయరని ఆ యువకుడికి సర్ది చెప్పారు. అయితే పదే పదే ఫోన్ చేస్తూ వారిని విసిగిస్తున్నాడు. దీంతో అధికారులు ఆక‌తాయికి స‌రైన బుద్ది చెప్పారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌రప్ర‌దేశ్ జ‌రిగింది

ఈ విషయం తెలుసుకున్న డీఎం ఆంజనేయ కుమార్ సింగ్ ఆ యువకుడి నాలుగు సమోసాలు తీసుకెళ్లి ఇవ్వండని సిబ్బందికి తెలిపాడు. అయితే, సమోసాలతోపాటు అదనంగా అతడికి మరో సర్‌ ప్రైజ్ కూడా ఇచ్చారు. సమోసాలతో ఆ యువకుడి ఇంటికెళ్లిన పోలీసులు.. తనతో బయటకు రావాలని కోరారు. పారిశుద్ధ్య పరికరాలు ఇచ్చి డ్రైనేజీలను శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా డీఎం అతడి ఫోటోను ట్వీట్ చేశారు. దీనితో అత‌డికి సరైన శిక్షే ప‌డింద‌ని ప‌లువురు నెటీజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. క‌రోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు బాధితుల సంఖ్య 1251కి చేర‌గా.. మృతుల సంఖ్య 32గా న‌మోదైంది.
Tags:    

Similar News