ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. ఏపీ, తెలంగాణ రెండురాష్ట్రాల్లోనూ శాసనసభలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రులు, ఆయా పార్టీల ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అయితే.. తెలంగాణలో ఉన్న 117 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోగా.. ఏపీలో మాత్రం ఇద్దరు ఎమ్మెల్యేలు తమ ఓటును వేయలేదు. దీంతో ఏపీలో 175 మందికి 173 మంది మాత్రమే ఓటు వేసినట్టు అయింది.
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహా వివిధ పార్టీలకు చెందిన 117 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకు న్నారు. మంత్రి గంగుల కమలాకర్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ఓటు వేయలేకపోయారు. వరంగల్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన సీఎం.. నేరుగా శాసనసభకు వచ్చి ఓటు వేశారు.
శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, ఉప సభాపతి పద్మారావు గౌడ్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రశాంత్రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదిలావుంటే, కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.. ప్రతిపక్ష అభ్యర్థికి వేయాల్సిన ఓటును బీజేపీ అభ్యర్థి ముర్ముకు వేసేశారు.
ఏపీలో 173 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 151 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేలు బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎన్.వెంకట్ గౌడ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
వీరితో కలుపుకొని 173 మంది శాసనసభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొత్తం 175 మంది శాసన సభ్యుల్లో 161 మంది శాసనసభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. చివరి నిముషంలో మరికొందరు ఓటేశారు. మొత్తంగా.. ఏపీలో ఇద్దరు మినహా మిగిలిన వారు ఓటేయడం గమనార్హం.