విశ్వసుందరి హర్నాజ్​ ధరించిన కిరీటం ధర ఎంతో తెలుసా..?

Update: 2021-12-18 02:55 GMT
ప్రపంచ సుందరి పోటీల్లో భారత​ ఆణిముత్యం మరో సారి మెరిసింది. గతంలో ఎప్పుడో ఐశ్వర్యా రాయ్​ ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకోగా తాజాగా మన దేశానికి చెందిన హర్నాజ్ సంధు అనే మరో అమ్మాయి చేజిక్కించుకుంది. ఈ కిరీటంతో పాటు భారత్ పేరును మరో సారి ప్రపంచ పటంపై నిలబెట్టింది ఈ సుందరి.

కేవలం 21 ఏళ్లు వయసు ఉండే ఈమె మన దేశానికి కూడా 21 ఏళ్ల తరువాత ప్రపంచ సుందరి కిరీటాన్ని భారత్​ కు అందించింది. ఇందుకోసం ఏంతోగానో కష్టపడింది హర్నాజ్​. తన విజయాన్ని భారత్​ లో ఉండే వారు అందరూ తమ విజయంగా భావించారు. ఇందుకు కారణం అమె మన దేశానికి చెందిన యువతి అని.

ఇదీలా ఉండే విశ్వ సుందరిగా ఆమె పేరుని జ్యూరీ ప్రకటించగానే ఆమె ఆనందంతో ఉబ్బి తబ్బి అయ్యారు. చాలా తక్కువ మందికి దొరికే ఈ అదృష్టంతో ఆమె ఏ మాత్రం పొంగిపోలేదు. నాలుగు ఆనంద భాష్పాలను కళ్లలో నింపుకొని విశ్వసుందరి కిరీటాన్ని మాజీ ప్రపంచ సుందరి నుంచి సాదరంగా అందుకున్నారు.

అయితే ప్రతీ ఏడాది నిర్వహించే ఈ పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది మాత్రం విశ్వ సుందరి కిరీటం. ఇది అందుకోవాలని ప్రతీ అమ్మాయి కలలు కంటుంది. ఈ అందాల పోటీల్లో పాల్గొనాలని చాలా మందికి ఉంటుంది. కారణం కూడా మరలా ఆ కిరీటమే. ఇంతకీ ఈ కిరీటంలో ఏముంది అని చాలా మంది భావిస్తుంటారు.

అందుకే ఆ కీరటం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచ వేదికపై మన భారతీయ యువతి అయిన ఆ 21 ఏళ్ల చిన్నది హర్నాజ్​ అందుకున్న ఆ కిరీటం విలువ సుమారు 5 మిలియన్​ డాలర్లకు పైగా ఉంటుందని తెలిసిన వారు చెప్తున్నారు. అంత మొత్తం అంటే భారతీయ కరెన్సీ ప్రకారం చూస్తే ఇక్కడ దాని విలువ సుమారు 39 కోట్ల రూపాయిలకు పైగానే ఉంటుంది. ఇంతలా ఈ కిరీటంలో ఏముందని తెలియని చాలా మంది అనుకుంటారు. అసలు నిజంగానే ఏముంది?

విశ్వ సుందరి కిరీటాన్ని ఆషామాషీగా తయారు చేయరు. దాని ధరకు తగ్గట్టుగానే అందులో బంగారం, వజ్రాలు ఉంటాయి. ఈ కిరీటంలో సుమారు 18 క్యారెట్ల బంగారం ఉంటుంది. దీనితో పాటు తెలుపు వజ్రాలు కూడా ఉంటాయి. అందుకే అంత ధర. దీనిని స్విస్​ లోని మౌవాద్​ అనే నగల దుకాణం తయారు చేస్తుంది. ఈ సంస్థ చెప్పిన దాని ప్రకారం కిరీటంలో సుమారు 17 వందలకు పైగా తెల్లటి వజ్రాలు దానిలో పొందుపర్చారు. ఇంతేగాకుండా దీనిలో ఇంకో ప్రత్యేక ఆకర్షణగా కెనరీ రత్నాలు ఉన్నాయి.

వీటిని ఈ కిరీటం మధ్యలో ఉంచారు. ఇవి కరీటం విలువతో పాటు చూసిన వారిని కూడా ఎంతగానో ఆకర్షిస్తాయి. అయితే ఈ కిరీటానికి ఓ పేరు కూడా ఉంది. ఈ కిరీటాన్ని పవర్‌ ఆఫ్‌ యునిటీ క్రౌన్‌ అనే పేరుతో పిలుస్తారు. దీనికి అర్థం వివిధ దేశాలకు చెందిన మనం ఖండాలుగా వేరుగా ఉన్నా కానీ అంతా ఒక్కటే. ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలని సూచిస్తుంది.

ఇదలా ఉంటే ఇప్పటి వరకు ప్రపంచ సుందరులు అందుకున్న కిరీటాల్లో కంటే ఇదే చాలా చిన్నది. అయితే ఇందులో పొదిగి ఉన్న డైమండ్​ క్యారెట్ లతో పోల్చి చూస్తే హర్నాజ్​ ధరించిన కిరీటమే పెద్దదని నిర్వాహకులు చెప్తున్నారు. ఇందుకో ఉండే ఓ వజ్రం వెయిట్​ సుమారు 62 క్యారెట్లకు పై మాటే అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూపొందించిన వాటిలో ఇదే చాలా ఖరీదైన కిరీటం అంట.


Tags:    

Similar News