జాతీయస్ధాయిలో ప్రజా ఫ్రంట్

Update: 2022-02-14 08:13 GMT
ప్రజలంతా కోరితే జాతీయ పార్టీ పెడతానంటు కేసీయార్ స్పష్టంగా ప్రకటించారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలన్న తన కోరికను కేసీయార్ మీడియా సమావేశంలో వ్యక్తంచేశారు.

మోడీ పాలనలో దేశం సర్వనాశనమైపోతోందంటు నిప్పులు చెరిగారు. నరేంద్రమోడి టార్గెట్ గా కేసీయార్ వరుసగా మీడియా సమావేశాలు పెట్టి వాయించేస్తున్న విషయం అందరు చూస్తున్నదే. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించేంత దమ్ముందని అవసరమైతే జాతీయ పార్టీ కూడా పెడతానని చెప్పారు.

కేంద్రంలోని బీజేపీ అవినీతి చిట్టాను ఒక్కోక్కటిగా బయటపెడతానన్నారు. శాంపులుగా రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ ఎత్తున అవినీతి జరిగిందన్నారు. మనకన్నా ఎక్కువ యుద్ధ విమనాలు కొనుగోలు చేసిన ఇండోనేషియా మనకన్నా తక్కువ ధరే చెల్లించిందన్నారు. మరిందిలో అవినీతి కళ్ళకు కట్టినట్లు కనబడటం లేదా అంటు కేంద్రాన్ని నిలదీశారు. దేశంలో తొందరలోనే కొత్త రాజకీయ ఫ్రంట్ వస్తుందని ఎవరు ఊహించొద్దన్నారు.

అయితే తొందరలోనే ప్రజల ఫ్రంట్ వస్తుందని కుండబద్దలు కొట్టారు. తనతో పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు. బెంగాల్ కు వస్తే అన్నీ విషయాలు మాట్లాడుదామని చెప్పారట. ఇదే పనిమీద తాను ముంబాయ్ కూడా వెళుతున్నట్లు చెప్పారు. ఏదేమైనా జాతీయ రాజకీయాల్లో తాను కీలక పాత్ర పోషించబోతున్నట్లు ప్రకటించారు. కేసీయార్ మాటలను బట్టిచూస్తే 2023 ఎన్నికల్లోపే జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు అర్ధమవుతోంది.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసీయార్ పై చాలామందిలో నమ్మకం లేదు. కేసీయార్ ఎప్పుడు ఎవరితో ఎలాగుంటారో తెలీదు. 2009 ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక కూటమితో అంటే టీడీపీ+వామపక్షాలతో కలిసి పోటీ చేసి పోలింగ్ అయిపోగానే మిత్రపక్షాలతో చెప్పకుండానే ఢిల్లీకి వెళ్ళి బీజేపీ అగ్రనేతలతో భేటీ అయిన విషయం తెలిసిందే.

ఇపుడు మమత విషయంలో కూడా చాలామందికి ఇదే సమస్యుంది. మోడీ అంటే తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారే కానీ మిగిలిన పార్టీలను కలుపుకుని వెళ్ళటం లేదు. కాంగ్రెస్ ను దూరంగా ఉంచినంత కాలం ప్రత్యామ్నాయ ఫ్రంట్ సాధ్యంకాదంతే.
Tags:    

Similar News