ప్రపంచ బాడ్మింటన్ విజేతగా నిలిచిన పీవీ సింధూపై దేశవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తన గెలుపును అందరికీ పంచుతూ అందరి అభిమానాలను పీవీ సింధూ చూరగొంటోంది. గెలిచిన మెడల్ తో ప్రధాని, కేసీఆర్ ను ఇప్పటికే కలిసిన పీవీ సింధూ తల్లిదండ్రులతో కలిసి తాజాగా ఏపీ సీఎం జగన్ ను అమరావతి వెళ్లి కలిశారు.
ఈ సందర్భంగా పీవీ సింధూను సీఎం జగన్ సత్కరించారు. ఓ మెమొంటోను జగన్ అందజేశారు. సింధూ తల్లిదండ్రులను అభినందించారు. ఈ సందర్భంగా సింధూ కోరిక ఏంటో జగన్ తెలుసుకున్నారు. ఆ కోరికను తీర్చారు. భవిష్యత్ లో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. ఏపీలో క్రీడలకు ప్రాధాన్యతనిస్తామని సహకరించాలని సింధూను జగన్ కోరారు.
సీఎం జగన్ కలిసిన అనంతరం పీవీ సింధూ మీడియాతో మాట్లాడారు. ఏపీ నుంచి భావి బ్యాడ్మింటన్ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు వైజాగ్ లో ఒక బ్యాడ్మింటన్ అకాడమీని నెలకొల్పాలనుకుంటున్నానని.. దాని కోసం వైజాగ్ లో 5 ఎకరాల స్థలం కావాలని జగన్ ను కోరానని సింధూ వెల్లడించారు. దీనికి సీఎం జగన్ అంగీకరించారని సింధూ తెలిపింది. ఏపీలో క్రీడాభివృద్ధి సహకరిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపింది.