అడవిలో ఇల్లు కట్టించుకుంటే ఎలా ఉంటుంది? ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే తీరులో ఉందని చెప్పాలి. మొన్నామధ్య ఆయన ఇంటి దగ్గర పాము దర్శనం ఇవ్వటంతో అధికారులు ఒక్కసారిగా కంగు తిని.. దాన్ని బయటకుపంపే కార్యక్రమం చేపట్టారు. తాజాగా అలాంటి పరిస్థితే మరొకటి ఎదురైంది.
తాజాగా ఏపీ సీఎం ఇంటికి సమీపంలోని బీబీ 1 వద్ద ఉన్న పోలీస్ ఔట్ పోస్ట్ దగ్గర ఒక కొండ చిలువను గుర్తించారు.వెంటనే దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు సిబ్బంది.అయితే.. కొండ చిలువ తప్పించుకొని తోట లోకి వెళ్లిపోయింది. దీంతో.. దాని జాడ తెలుసుకునేందుకు పోలీసులు కిందామీదా పడ్డారు. చివరకు వారి ప్రయాస ఫలించి.. కొండచిలువ కనిపించింది.
వెంటనే దాన్ని.. పక్కనున్న తోటల వైపు వెళ్లగొట్టారు. ఇటీవల కాలంలో పాముల బెడద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి ఇబ్బందిగా ఉంది. ఇంటికిభద్రతా బాధ్యతలు చేపట్టేవారు.. ఈ పాముల గురించి తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఏదైనా తేడా వచ్చి.. ఇంటి లోపలకు వెళితే.. తమ ఉద్యోగాలకే ఎసరు రావటం ఖాయమని వారు ఆందోళన చెందుతున్నారు. చుట్టూ పెద్ద ఎత్తున పొలాలు ఉండటంతో ఇలాంటి పాములు.. కొండచిలువలు.. కీటకాలు బెడద ఎక్కువగా ఉందన్న అభిప్రాయాన్ని భద్రతాసిబ్బంది వ్యక్తం చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/