మోడీ మాటకు మొదటిసారి వంగుతున్నారా?

Update: 2015-09-27 09:44 GMT
కేంద్రానికి కొన్ని రాజ్యాంగ సంస్థలకు మధ్యనుండే అనుబంధం తప్పనిసరి. వాటి మధ్య సఖ్యత లేకపోతే ఇబ్బందులు ఎదురుకావాటం ఖాయం. ప్రపంచ పరిణామాల్లో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు స్పందించాలని భారత సర్కారు భావిస్తుంటే.. అందుకు భిన్నంగా ఆర్ బీఐ చీఫ్ వ్యవహరిస్తున్నారన్న చర్చ నడుస్తోంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించాలన్న డిమాండ్ కేంద్ర సర్కారు చేస్తోంది. అయితే.. ఆ విషయంపై కేంద్రం  చేస్తున్న సూచనను రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ మీద పెద్దగా పని చేయటం లేదు. తామెంత చెప్పినా మాట వినని రాజన్ మీద కేంద్ర సర్కారు గుస్సాగా ఉంది. చైనాలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో బ్యాంకుల వడ్దీ రేట్లను కానీ తగ్గిస్తే.. అది భారత్ కు ప్రయోజనంగా మారుతుందని పారిశ్రామికవేత్తలు.. ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

రెపో రేట్లలో కోత పడటం ద్వారా ప్రయోజనాలు పొందాలని భావిస్తున్న కేంద్ర వైఖరిని ఇంతకాలం విభేదిస్తున్న రాజన్.. మరోరెండు రోజుల్లో జరిపే దవ్య పరపతి రేట్లకు కోత పెట్టే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. తాము చెప్పినట్లుగా కాకుండా.. తనకు నచ్చినట్లుగా రాజన్ వ్యవహరిస్తున్న విమర్శ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో.. రాజన్ మీద విపరీతమైన ఒత్తిడి నెలకొని ఉందని.. దీన్ని అధిగమించేందుకు వీలుగా ప్రభుత్వం కోరినట్లుగా ద్రవ్య పరపతి రేట్లకు కోత పెట్టాలని ఆర్ బీఐ చీఫ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. మరి.. ఈ అంచనాలు ఎంతవరకు నిజం అవుతాయో చూడాలి.
Tags:    

Similar News