బండారుకు మానసిక ఆరోగ్యం బాగలేదా ?

Update: 2022-02-23 04:32 GMT
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మానసిక పరిస్థితి పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైజాగ్ వైసీపీ నేత రెహమాన్ మీడియాతో మాట్లాడుతూ బండారును మానసిక వైద్యుడికి అర్జంటుగా చూపించాలంటు హితవు పలికారు. డాక్టర్ కు చూపించకపోతే కుటుంబసభ్యులు కూడా ఇబ్బందులు పడతారంటు ఆందోళన వ్యక్తంచేశారు.

 ఇంతకీ బండారు మానసిక పరిస్ధితిపై  రెహమాన్ ఆందోళన చెందాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఏమొచ్చిందంటే పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై సీబీఐ విచారణ చేయించాలని బండారు డిమాండ్ చేశారు కాబట్టే. దుబాయ్ ఎక్స్ పో-2022లో పాల్గొనేందుకు మంత్రి దుబాయ్ వెళ్ళారు. అక్కడే వారం రోజుల పాటు క్యాంపు వేశారు. మొన్న ఆదివారమే దుబాయ్ నుండి హైదరాబాద్ కు తిరిగొచ్చారు.

 ఆదివారం హైదరాబాద్ కు వచ్చిన మంత్రి సోమవారం ఉదయానికి గుండెపోటుతో చనిపోయారు. ఇదే విషయాన్ని బండారు ప్రస్తావిస్తూ మంత్రి దుబాయ్ లో ఉండగా పరిశ్రమలు తేవాలంటు బాగా ఒత్తిడి పెట్టిందెవరో తేలాలన్నారు. మంత్రిని జగన్మోహన్ రెడ్డే బాగా ఇబ్బంది పెట్టినట్లు ఆరోపించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రతి విషయాన్ని జగన్ కు ముడి పెట్టేసి టీడీపీ నేతలు నానా రచ్చ చేస్తున్నారు. ఇందులో భాగంగానే బండారు తాజాగా నోరు పారేసుకున్నారు. ప్రభుత్వంపైన వ్యక్తిగతంగా జగన్ పైన బురద చల్లటం తప్ప మరేమీ కాదిది.

 50 ఏళ్ళ గౌతమ్ కు గుండెపోటు రావటం ఏమిటని బండారు ప్రశ్నించటమే విచిత్రంగా ఉంది. 50 ఏళ్ళు కాదు ఇంకా చిన్నవాళ్ళకు కూడా గుండెపోటు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. గుండెపోటు రావటానికి వయసుతో సంబంధం లేదన్న కనీస ఇంగితం కూడా బండారుకు లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.

దుబాయ్ లో ఉన్నన్ని రోజులు మంత్రి భరించలేని ఒత్తిడికి గురవ్వటం వల్లే హైదరాబాద్  కు రాగానే గుండెపోటు వచ్చి చనిపోయినట్లు బండారు తేల్చేశారు. అందుకనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బండారు మీడియాతో మాట్లాడినపుడు సీనియర్ నేత, ఎంఎల్ఏ గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు పక్కనుండటం గమనార్హం.

    

Tags:    

Similar News