ఏఆర్ రెహమాన్.. ఈ పేరు వింటే చాలు భారతదేశంలో ఆకుల సవ్వడి కూడా ఆగిపోతుంది. ఆయన సంగీతం తప్ప ఇంకేమీ వినపడకూడదన్న ఉద్దేశంతో నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. భారత్ లోనే కాదు అంతర్జాతీయంగానూ రెహమాన్ ఎంతో పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు. బహుశా అందుకేనేమో... ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి - సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తన పుట్టిన రోజు వేడుకల్లో రెహమాన్ సంగీతం ఉండాల్సిందేనని పట్టుపట్టారట. దీంతో రెహమాన్ ను బతిమలాడి ఎలాగోలా వీలు చూసుకుని ఆ రోజు కాస్త కచేరీ ఇవ్వమని సమాజ్ వాది నాయకులు వెంటపడ్డారట. పాపం.. రాజకీయాల్లో తలపండిన పెద్దాయన కదా అని రెహమాన్ సరేనన్నట్లు సమాచారం. దీంతో ఆదివారం జరగబోయే వేడుకల కోసం రెహమాన్ రెడీ అయ్యారట.
ములాయం 76వ పుట్టిన రోజును ఆయన స్వగ్రామం సైఫాయ్ లో ఆదివారం నిర్వహించబోతున్నారు. ఎంపీ ధర్మేంద్రయాదవ్ ఈ ఏర్పాట్లన్నీ చూసుకుంటున్నారట. ములాయం కోరిక మేరకు ఆయన రెహమాన్ ను ఈ వేడుకల్లో ప్రోగ్రాం చేసేందుకు అతికష్టం మీద ఒప్పించినట్లు తెలుస్తోంది. ములాయం జన్మదిన వేడుకలు రెహమాన్ కచేరీ తోనే ప్రారంభించబోతున్నారు. దీనికోసం రెహమాన్ ఇప్పటికే సైఫాయ్ చేరుకోగా ఆయనకు అక్కడ ఘన స్వాగతం పలికారు. ఆదివారం సైఫాయి రెహమాన్ సంగీతంతో పులకరించబోతోంది.