రజినీకాంత్, పవన్ కళ్యాణ్ కు ట్విట్టర్ షాక్

Update: 2020-03-22 04:07 GMT
కరోనా వైరస్ దేశమంతా ప్రబలుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ వైరస్ పై కొందరు అవాకులు, చెవాకులు పేల్చుతున్నారు. ఇష్టమొచ్చిన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనిపై సీరియస్ గా ఉండాలని.. కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ నిన్ననే హెచ్చరించారు. ఇక కరోనాపై తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ట్వీట్లు తొలగించాలని ఫేస్ బుక్, ట్విట్టర్ యాజమాన్యాలకు కేంద్రం అల్టిమేటం జారీ చేసింది.

తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో కరోనాపై ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లలో 12 గంటల్లో కరోనా వైరస్ చనిపోతుందని వ్యాఖ్యానించారు.

అయితే కరోనా 12 గంటల్లో చనిపోతుందని రజినీ, పవన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ట్విట్టర్ యాజమాన్యానికి పలువురు ఫిర్యాదు చేశారు.

దీన్ని సీరియస్ గా తీసుకున్న ట్విట్టర్ సంస్థ వెంటనే రజినీకాంత్, పవన్ చేసిన ట్వీట్లను తొలగించి వారికి గట్టి షాక్ ఇచ్చింది. తప్పుడు సమాచారం ఇస్తే అలాంటి ట్వీట్లను గుర్తించి తొలగించాలని ఇదివరకే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News