ప్రముఖ పారిశ్రామికవేత్త జయరాం హత్యకేసులో పోలీసులకు కీలక సాక్ష్యం దొరికింది. జయరాం హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాకేష్ రెడ్డి నందిగామ విజయా బార్ లో రాకేష్ రెడ్డి బీరు బాటిళ్లు కొని తీసుకెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. జయరాం మృతదేహాన్ని కారులోనే ఉంచి బార్ లో మద్యం కొనుగోలు చేయడం విశేషం. కార్ లో డెడ్ బాడీని పెట్టుకొని మద్యం కొనుగోలుకు వెళ్లాడంటే అతడి నేరప్రవృత్తి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
పోలీసులకు పట్టుబడుతానన్న భయం లేకుండా విచ్చలవిడిగా డెడ్ బాడీతో స్వయంగా కారు నడుపుతూ రాకేష్ రెడ్డి హత్యకు ప్లాన్ చేయడం విశేషంగా చెప్పవచ్చు. కారులో లభించిన మద్యం బాటిళ్లు స్వయంగా రాకేష్ రెడ్డి నందిగామలోని బార్ లో కొనుగోలు చేసినవని పోలీసులు తేల్చారు.
జయరాం మృతికి సంబంధించిన చిక్కుమడులు క్రమంగా వీడుతున్నాయి. నిందితుడు రాకేష్ రెడ్డి మృతదేహంతో ఎక్కడెక్కడ తిరుగాడనే దానిపై సీసీ టీవీ ఫుటేజీ లభ్యం మవుతోంది. వైట్ షర్ట్ వేసుకున్న రాకేష్ రెడ్డి డ్రింక్ చేస్తూ.. డ్రైవ్ చేస్తూ.. కొంత మద్యాన్ని మృతదేహంపై పోస్తూ వెళ్లినట్టు తెలుస్తోంది.
జయరాంను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు రాకేష్ రెడ్డి ప్రయత్నించారు. శిఖా చౌదరిని తప్పించే ప్రయత్నంలో రాకేష్ రెడ్డి నేరం తనమీద వేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.