యూపీ స్వీట్ షాప్ రాఖీ స్పెషల్.. కేజీ రూ.25వేలేనట!

Update: 2022-08-12 04:27 GMT
భారతదేశం పేద దేశమని కొందరు ఇప్పటికి నిష్ఠూరాలు ఆడుతుంటారు. ఇప్పుడీ విషయాలు తెలిస్తే..ప్రపంచంలో ఎవరు మాత్రం ఇలాంటి ఖరీదైన తిండిని తినగలుగుతారు చెప్పండి? కేజీ స్వీట్ రూ.25వేలు.

ప్రస్తుతం దేశంలో పండుగల సీజన్ షురూ అయిన వేళ.. తమ కస్టమర్ల కోసం కొన్ని స్వీట్ షాపులు భారీ ఎత్తున ప్రత్యేక మిఠాయిలు తయారు చేస్తుంటారు.

ఇప్పుడా కోవలోకే వస్తుంది ఈ స్వీట్ షాప్. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈ మిఠాయి దుకాణంతో రాఖీ నేపథ్యంలో బంగారుపూత పూసిన స్వీట్ ను సిద్ధం చేశారు. దీని ఖరీదు కేజీ పాతికవేల రూపాయిలు కావటం ఆసక్తికరంగా మారింది.

24 క్యారెట్ల బంగారం పూతతో సిద్ధమైన ఈ స్వీట్ ను చూశాక.. దాన్ని కొనుగోలు చేస్తున్న వారిని చూశాకభారత్ పేద దేశమని చెప్పలేం. సమస్యల్లా.. సంపన్న.. పేదవారి మధ్య అంతరం భారీగా పెరిగిపోవటమే దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యగా చెప్పాలి.

ఈ బంగారుస్వీట్ సంగతి ఇలా ఉంటే.. మహారాష్ట్రలోని నాసిక్ కు చెందిన మరో స్వీట్ షాపు సైతం బంగారుపూతతో ఒక మిఠాయిని సిద్ధం చేసింది. దాని ఖరీదు కూడా కేజీ రూ.6వేలుగా చెబుతున్నారు.

ఏమైనా.. బంగారు పూతతో సిద్ధం చేస్తున్న మిఠాయిల్ని ప్రత్యేక పర్వదినాల్లో కొనుగోలు చేయటానికి పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తమవుతోంది. దేశంలో వెనుకపడిన రాష్ట్రాల్లో ఒకటిగా చెప్పే యూపీలో.. ఇంత భారీ ధరలు పెట్టి మిఠాయిలు కొంటున్నారంటే.. దేనికి నిదర్శనమంటారు?
Tags:    

Similar News