అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం కోసం విశ్వహిందూ పరిషత్ (వీహెచ్.పీ ) దేశవ్యాప్తంగా భారీగా విరాళాలు సేకరించింది. సామాన్యుల నుంచి పారిశ్రామికవేత్తలు, నేతలు, సినీ ప్రముఖులు ఇలా భారీగా చెక్కులు, నగదును ఇచ్చారు. అలా సేకరించిన దాదాపు 15వేల చెక్కులు బౌన్స్ అయినట్టు సమాచారం. వీటి విలువ ఏకంగా రూ.22 కోట్లుగా ఉంది.
బ్యాంకు ఖాతాల్లో సరిపడా నిధులు ఉంచకపోవడం.. సాంకేతిక లోపాల కారణంగానే చెక్కులు బౌన్స్ అయినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తన ఆడిట్ నివేదికలో పేర్కొంది. సాంకేతిక లోపాలు సరిద్దిదేందుకు ప్రయత్నిస్తున్నామని ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా పేర్కొన్నాడు.
ప్రజలు మరోసారి విరాళాలు ఇవ్వాలని బ్యాంకులు అడుగుగున్నట్టు అనిల్ మిశ్రా కోరారు. కాగా ఈ చెక్కుల్లో దాదాదాపు 2వేల చెక్కులు అయోధ్య నుంచే వచ్చినట్టు మిశ్రా పేర్కొన్నారు.జనవరి 15 నుంచి ఫిబ్రవరి 17వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో వీహెచ్.పీ విస్తృతంగా విరాళాలు సేకరించింది. ఈ సందర్భంగా దాదాపు రూ.5వేల కోట్లు విరాళాలుగా వచ్చాయని ట్రస్ట్ తెలిపింది.