ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం మంచి పనే అయినా.. చట్టబద్ధమైన సమస్యలు వెంటాడి వేధిస్తుంటాయి. ఈ కారణంతోనే దారిన పోయేది మీద వేసుకోవటానికి చాలామంది ముందుకు రారు. రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినా.. ప్రమాదంలో గాయపడిన చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే.. అలాంటి వారిని ఆసుపత్రికి తరలించటానికి చాలామంది ఆసక్తి చూపించరు. పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు సైతం వెనుకాడతారు.
ఎందుకిలా అంటే.. పోలీసుల విచారణ.. పోలీసులు పెట్టే కేసులే కారణంగా చెబుతారు. అయితే.. ఈ భయాలు ఇకపై ఉండవు. ఎందుకంటే.. దేశంలో మొదటిసారి.. కర్ణాటక రాష్ట్రం తయారు చేసిన బిల్లుపై తాజాగా రాష్ట్రపతి కోవింద్ సంతకం పెట్టటంతో కొత్త చట్టం అమల్లోకి వచ్చినట్లైంది.
ఇంతకీ.. ఈ కొత్త చట్టం ఏమంటే.. ప్రమాదంలో గాయపడిన వారు కానీ.. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారిని ఆసుపత్రికి తరలించిన వారిపై ఎలాంటి విచారణ.. ఎలాంటి కేసులు ఉండవు. పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు.ఇదే అంశంతో కర్ణాటక ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఒక బిల్లును అక్కడి అసెంబ్లీ ఆమోద ముద్ర వేసి రాష్ట్రపతికి పంపింది. తాజాగా ఈ బిల్లుపై రాష్ట్రపతి కోవింద్ ఆమోద ముద్ర వేయటం ద్వారా చట్టంగా మారింది.
తాజాగా మారిన చట్టం ప్రకారం ప్రమాదానికి గురై.. చావు బతుకుల మధ్య ఉన్న వారిని ఆసుపత్రికి తీసుకొచ్చిన వారిపై ఎలాంటి పోలీసు ఒత్తిడి ఉండకపోగా.. వీలైనంతవరకూ ప్రోత్సాహాకాలు అందించేలా ఈ చట్టాన్ని రూపొందించారు. గెజిట్ విడుదల ద్వారా ఈ చట్టం అమల్లోకి రానుంది. కర్ణాటక రాష్ట్ర సర్కారు తీసుకొచ్చిన ఈ చట్టాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.