తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పై బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ ప్రశంసల జల్లు కురిపించారు. తన మనసుకు చాలా సంతోషం కలిగించేలా కేసీఆర్ వ్యవహరించారని తెలిపారు. హైదరాబాద్ లోని జలవిహార్ లో ఇవాళ జరిగిన కార్యక్రమంలో రామ్ నాథ్ కోవింద్ మాట్లాడారు. గవర్నర్ గా ఏ పార్టీతోనే అనుబంధం పెట్టుకుని పనిచేయలేదన్నారు. గవర్నర్ గా రాజీనామా చేసిన తర్వాత కూడా తాను ఎటువంటి రాజకీయ పార్టీలో చేరలేదన్నారు. రాష్ట్రపతిగా కూడా రాజకీయాలకు అతీతంగా బాధ్యతలు నిర్వర్తిస్తానన్నారు. ప్రెసిడెన్సీ ఆఫీసు రాజకీయాలకు అతీతం అని కోవింద్ అన్నారు.
రాష్ట్రపతి అభ్యర్థిగా తన పేరును ప్రకటించకముందే టీఆర్ ఎస్ పార్టీ మద్దతును వెల్లడించడం సంతోషకర విషయమని ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. సీఎం కేసీఆర్ తన కోసం హిందీలో ప్రసంగించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. సిటీలో దారిపొడువునా ఏర్పాటు చేసిన స్వాగత హోర్డింగ్ లు చూసి సంతోషం వేసిందన్నారు. నామినేషన్ వేసిన రోజున సీఎంలు అందరూ ఆ కార్యక్రమానికి హాజరుకావడం కూడా ఆనందంగా ఉందన్నారు. రాజ్యాంగమే తనకు ముఖ్యమని, దేశాభివృద్ధికి కృషి చేస్తానని కోవింద్ తెలిపారు. ఎన్డీఏ - ఎన్డీయేతర పార్టీలు తనకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగబద్ధ పదవులు స్వీకరించినప్పుడు వాటికి న్యాయం చేయాలన్నారు. ప్రపంచంలోనే మనది అతిపెద్ద ప్రజాస్వామ్యం అన్నారు. రాష్ట్రపతులుగా మహామహాలు పనిచేశారన్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రామ్‌నాథ్ తెలిపారు
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/