దేశంలోనే ఫ‌స్ట్ టైం.. 'మై సెకండ్ వైఫ్ రెస్టారెంట్‌` ఎందుకంటే!

Update: 2022-12-26 01:30 GMT
స‌హ‌జంగానే ఏదో ఒక కార‌ణంతో రెండో పెళ్లి చేసుకునేవారు ఉంటారు. అది పురుషుడు కావొచ్చు.. మ‌హిళ కావొచ్చు. అనివార్య‌మైన సంద‌ర్భంలో త‌ప్ప‌దు. అయితే.. వీరి కోసం ప్ర‌త్యేకంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎవరూ ఎలాంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌లేదు. కానీ, బిహార్కు చెందిన ఓ వ్యక్తి  'మై సెకండ్ వైఫ్ రెస్టారెంట్' అని పేరతో ఒక హోట‌ల్ ను ప్రారంభించారు. దీని ప్ర‌త్యేక‌త ఏంటంటే. రెండో వివాహం చేసుకున్నవారికే దీనిని కేటాయించారు. అంతేకాదు.. రెండో వివాహం చేసుకున్న‌వారు తన హోటల్కు వస్తే ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తున్నారు.  చిత్రంగా ఉన్న ఈ హోట‌ల్‌కు సెకండ్ మ్యారేజీ చేసుకున్న దంప‌తులు క్యూ క‌డుతున్నారు.

బిహార్కు చెందిన రంజిత్ కుమార్ వినూత్నంగా ఆలోచించాడు. కొత్తగా పెట్టిన తన హోటల్కు 'మై సెకండ్ వైఫ్ రెస్టారెంట్' అని పేరు పెట్టారు. అంటే 'నా రెండో భార్య రెస్టారెంట్‌' అని అర్థం.

అంతే కాదు, పేరుకు తగ్గట్టు.. రెండో వివాహం చేసుకున్నవారు ఈ హోటల్కు వస్తే డిస్కౌంట్ కూడా ఇస్తున్నాడు. బిహార్ రాజ‌ధాని నుంచి  70 కిలోమీటర్ల దూరంలో ఉండే బాడ్ పట్టణంలో ఈ హోటల్ నెలకొల్పాడు రంజిత్. రోడ్డుపై వెళ్తున్నవారు పేరు చూసి చిత్రంగా ఉందే అంటూ.. హోటల్కు వస్తున్నారు.

ప్రస్తుతం హోటల్లో టీ, బర్గర్లు, నూడుల్స్ వంటి ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచుతున్నట్లు రంజిత్ తెలిపాడు. వేసవి కాలంలో ఐస్క్రీమ్లు సైతం విక్రయిస్తానని చెబుతున్నాడు. రెస్టారెంట్కు 'మై సెకండ్ వైఫ్' అని పేరు పెట్టడానికి ఓ కారణం ఉందని చెబుతున్నారు.

సాధారణంగా ఇంట్లో కంటే ఇక్కడే ఎక్కువ సమయం గడుపుతున్నానని, అందుకే ఈ హోటల్ తన రెండో భార్య వంటిదని అంటున్నాడు. 'ఇంటి వద్ద నాకు భార్య ఉంది. ఇక్కడ మాత్రం రెస్టారెంట్ నా భార్య వంటిది. ఇవి రెండంటే నాకు ఇష్టం' అని చెబుతున్నాడు. హోటల్కు ఇలాంటి పేరు పెట్టడంపై తన కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారని రంజిత్ చెబుతున్నారు.

రెండోసారి వివాహం చేసుకున్నవారికి ఈ హోటల్లో డిస్కౌంట్ సైతం లభిస్తుంది. రెండో వివాహం చేసుకున్న మహిళలైనా, పురుషులైనా.. వారికి తన హోటల్లో డిస్కౌంట్ ఇస్తానని రంజిత్ చెబుతున్నాడు. 'సాధారణంగా కస్టమర్లలో ఎవరికి రెండో వివాహం జరిగిందో తెలుసుకోవడం కష్టమే. కానీ, ఎవరైనా రెండు వివాహాలు చేసుకున్నట్లు తెలిస్తే మాత్రం కచ్చితంగా డిస్కౌంట్ ఇస్తా' అని రంజిత్ తెలిపాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News