ఈరోజు అసెంబ్లీలో ఏపీ రాజధాని - అభివృద్ది గురించి ప్రవేశపెట్టిన కీలక బిల్లులకు జనసేన ఎమ్మెల్యే రాపాక మద్దతు ఇచ్చారు. జనసేన పార్టీ వ్యతిరేకంగా ఓటువేయమని ఆదేశాలు జారీ చేసినా రాపాక మాత్రం జగన్ నిర్ణయాలను సమర్థించారు. ఈ సందర్భంగా జగన్ చంద్రబాబుల గురించి రాపాక చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
జగన్ గురించి రాపాక
జగన్ కు పరిపాలన అనుభవం లేదని జనాల్ని మొదటి సారి మభ్యపెట్టారు. జనం నమ్మారు. కానీ జనం రెండోసారి ఎవరి మాట విని మోసపోలేదు. ఒక్కఛాన్స్ ఇద్దామని ఇచ్చారు. జగన్ వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా... ప్రజలకు మంచి చేయడానికి కావల్సింది అనుభవం కాదని, మంచి చేయాలనే తపన అని వ్యాఖ్యానించారు. పాలనకు అనుభవం అవసరమే భ్రమలను జగన్ పటాపంచలు చేశారని అన్నారు. జగన్ ఎవరికీ అందని ఆలోచనలు చేస్తారని - ఆ విషయంలో జగన్ అందుకోవడం కష్టం అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే జగన్ పాలనలో తన దైన ముద్ర వేశారని, ప్రజలకు నిజంగానే మంచి సీఎం అనిపించుకున్నారని రాపాక అన్నారు. ఏపీ జగన్ చేతిలో ఉండటం అదృష్టం అన్నారు. రాష్ట్రాన్ని సరైన మార్గంలో నడిపించడంలో జగన్ దూసుకెళ్తారన్నారు. ఉన్నతమైన వ్యక్తిత్వం వల్లే జగన్ కి మంచి ఆలోచనలు వస్తున్నాయని రాపాక జగన్ పై ప్రశంసలు కురిపించారు.
చంద్రబాబు గురించి రాపాక
వికేంద్రీకరణ బిల్లు సందర్భంగా జనసేన ఎమ్మెల్యే రాపాక చంద్రబాబుపై సెటైర్లు విసిరారు. తెలుగుదేశం అధ్యక్షుడిగా జగన్ ఆలోచన చంద్రబాబుకు నచ్చడం లేదు గాని... వ్యక్తిగతంగా మూడు రాజధానుల విధానం బాబుకు ఇష్టమేనని రాపాక సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులపై ఓటింగ్ పెడితే ఎవరు గెలుస్తారో చంద్రబాుబకు తెలుసుని, అయినా తప్పుదు కాబట్టి ఆయన డిమాండ్ చేస్తున్నారని రాపాక వ్యాఖ్యానించారు. నేను కొందరిని సంప్రదించాను. మూడు రాజధానుల కాన్సెప్టు ప్రజలకు నచ్చింది. ప్రజలు ఎన్నుకున్న వాడిగా నేను వారి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాలి అందుకే దీనికి మద్దతు పలుకుతున్నాను అని రాపాక వ్యాఖ్యానించారు.