జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు దిమ్మదిరిగే షాకిచ్చారు. మూడు రాజధానులపై ఈరోజు ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్న మూడు రాజధానులకు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు.
ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించారు. రాజధాని అమరావతి రైతులతో కలిసి ఆందోళనల్లో పాల్గొన్నారు. బీజేపీతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలకు శ్రీకారం చుడుతున్నారు. కానీ ఆ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం.. మూడు రాజధానులకు ఏపీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా మద్దతు తెలుపుతానని.. జగన్ కు జై కొట్టడం సంచలనంగా మారింది.
తమ అధినేత పవన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగన్ కు మద్దతు తెలుపుతానని తాజాగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద తెలిపారు.
ఈ పరిణామం జనసేనకు షాకింగ్ లా మారింది. ఓ వైపు వ్యతిరేకిస్తూ పోరాటం మొదలు పెడుతుంటే ఆయన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మాత్రం సీఎం జగన్ కు జై కొట్టడం జనసేన వర్గాలను షాక్ కు గురిచేసింది.