అధినేతకు కోపం వస్తుందని తెలిసినా తాను ఆపుకోలేనంటూ ఏపీ టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తాను మాట్లాడితే ముఖ్యమంత్రి చంద్రబాబుకు కోపం వస్తుందంటూనే ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని సీఎం చంద్రబాబు పదిసార్లు కలిసినా రైల్వే జోన్ ఎందుకు రావటం లేదన్న సూటి ప్రశ్నను రాయపాటి సంధించటం ఇప్పుడు కొత్త కలకలంగా మారింది. తాను మాట్లాడితే బాబుకు కోపం వస్తుందని.. అయినప్పటికీ తాను మాట్లాడతానన్న ఆయన.. రైల్వేజోన్ రాని అంశంపై ముఖ్యమంత్రి కానీ.. పార్టీ నేతలుకానీ ఆలోచించటం లేదని.. కొన్ని రోజులైతే.. రైల్వేజోన్ ను కూడా మర్చిపోవటమే అంటూ తీవ్రస్థాయిలో మండిపడటం గమనార్హం.
రైల్వేబోర్డుతో జరుగుతున్న సమావేశం నుంచి అర్ధాంతరంగా బయటకు వచ్చేసిన రాయపాటి.. మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని.. ముఖ్యమంత్రి.. రైల్వే మంత్రి చెప్పినా అధికారులు అస్సలు పట్టించుకోవటం లేదని. వారి మాటల్ని లెక్క చేయటం లేదన్నారు. వారు ప్రధాని మోడీ కన్నా పవర్ ఫుల్ అని వ్యాఖ్యానించటం విశేషం. చిన్న పనుల్ని కూడా రైల్వే అధికారులు చేయటం లేదని. ఇలా అయితే ప్రజలు తమను చెప్పుతో కొడతారన్న ఆయన.. గుంటూరు - తెనాలి డబ్లింగ్ పనులు పదేళ్లుగా సా..గుతున్నాయన్నారు.
విభజనలో భాగంగా రాష్ట్రానికి ఇస్తానన్న రైల్వే జోన్ రైల్వే అధికారుల వల్లే రావటం లేదని. .విశాఖకు రైల్వే జోన్ రావటం రైల్వే శాఖాధికారులకు అస్సలు ఇష్టం లేదన్నారు. ప్రతి ఏటా సమావేశాలు పెట్టి విందు భోజనాలు పెడుతూ పంపిస్తున్నారే తప్పించి.. పనులు పూర్తి కావటం లేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు - చెన్నై డే ట్రైన్ అడిగానని.. దానికీ స్పందన లేదన్న రాయపాటి.. రైల్వే అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేంద్రానికి.. తనకు ఇబ్బంది కలిగేలా మాట్లాడిన రాయపాటి వారి మాటలకు బాబు మరెంత ఆగ్రహానికి గురి అవుతారో?