బాబుకు షాక్.. క‌మ‌లం గూటికి రాయ‌పాటి!

Update: 2019-07-22 06:37 GMT
సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు బీజేపీకి ఇచ్చిన బ‌లం అంతా ఇంతా కాదు. పార్టీ ఉనికి పెద్ద‌గా లేని రాష్ట్రాల్లోనూ పాగా వేసే దిశ‌గా పావులు క‌దిపేంత‌టి మ‌నోస్థైర్యాన్ని ఎన్నిక‌ల ఫ‌లితాలు ఇచ్చాయ‌ని చెప్పాలి. నాలుగు ఎంపీ స్థానాల్ని సొంతం చేసుకున్న నేప‌థ్యంలో తెలంగాణ‌లో పార్టీని మ‌రింత ప‌టిష్ట‌ప‌ర్చేందుకు వీలుగా ప్లానింగ్ చేస్తుంటే.. ఏపీలోనూ పార్టీని ప‌టిష్టం చేయ‌టానికి వీలుగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార‌ప‌క్షానికి ధీటుగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం లేని నేప‌థ్యంలో.. ఆ లోటును భ‌ర్తీ చేసేందుకు క‌మ‌ల‌నాథులు సిద్ధ‌మ‌వుతున్నాయి. రానున్న ఐదేళ్ల‌లో కేంద్రంలో తిరుగులేని రీతిలో అధికారం చేతిలో ఉన్న నేప‌థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బ‌లోపేతం చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో బీజేపీ నేత‌లు ఉన్నారు.

ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేసిన బీజేపీ అధినాయ‌క‌త్వం అందుకు త‌గ్గ‌ట్లు త‌మ వ్యూహాల్ని అమ‌లు చేస్తున్నారు. టీడీపీలో బ‌ల‌మైన నేప‌థ్యం.. క్యాడ‌ర్ ఉన్న నేత‌ల్ని త‌మ పార్టీలో చేర్చుకోవ‌టం ద్వారా ఇన్ స్టెంట్ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల్ని పొందేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ప‌లువురు నేత‌ల్ని గుర్తించి.. వారిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు అవ‌స‌ర‌మైన ప్లానింగ్ చేస్తున్నారు.

తాజాగా గుంటూరు జిల్లాలో సీనియర్ నేత‌గా.. బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉన్న రాయ‌పాటి సాంబశివ రావును బీజేపీలోకి వ‌చ్చేందుకు.. కాషాయ కండువాను క‌ప్పుకునేందుకు వీలుగా ఇప్ప‌టికే రాయ‌బారాన్ని న‌డిపిన బీజేపీ అధినాయ‌క‌త్వానికి త‌గ్గ‌ట్లే రాయ‌పాటి స్పందిస్తున్నారు. బీజేపీలోకి వెళ్లేందుకు ఆయ‌న సిద్ధ‌మ‌య్యారు. తానున్న టీడీపీకి రాజీనామా చేసేందుకు ఆయ‌న త‌యార‌వుతున్నారు.

ఇటీవ‌ల రాయ‌పాటిని ఆయ‌న నివాసంలో భేటీ అయ్యారు బీజేపీ కీల‌క నేత రాంమాధ‌వ్‌. అనంత‌రం టీడీపీ అధినేత చంద్ర‌బాబును క‌లిసిన రాయ‌పాటి తాను పార్టీ మార‌నున్న విష‌యాన్ని చెప్ప‌ట‌మే కాదు.. ఢిల్లీలో త‌న‌కున్న భ‌వ‌నం తాలుకూ ఇష్యూ ఉంద‌ని.. కొన్ని చెప్ప‌లేని అంశాలు ఉన్న‌ట్లుగా చెప్పి.. పార్టీ మార‌నున్న విష‌యాన్ని ఆయ‌న దృష్టికి తీసుకెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు. తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల్ని చూస్తే.. టీడీపీకి త్వ‌ర‌లోనే రాయ‌పాటి గుడ్ బై చెప్పేయ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది.

Tags:    

Similar News