తెలుగు నాట ఎందరో మహానుభావులు ఉన్నారు. తెలుగు సీమకు తమ ప్రతిభా పాటవాలతో మేలు చేసిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో అగ్రగణ్యుడు నందమూరి తారక రామారావు. ఆయన గురించి చెప్పాలీ అంటే ఎక్కడ నుంచి మొదలెట్టాలో కూడా అర్ధం కాదు. ఆయన విశ్వ విఖ్యాతిని సాదించిన గొప్ప నాయకుడు.
అలాంటి ఎన్టీయార్ పేరుని తీసేయాలీ అంటే ఎంతో సాహసం ఉండాలి. మరి ఆ పని చాలా సులువుగానే వైసీపీ ప్రభుత్వ పెద్దలు చేశారు. లేని అపకీర్తిని మూటకట్టుకున్నారు. ఇపుడు ఇది దేశమంతా కూడా చర్చకు తావిస్తోంది. జగన్ని ఈ రోజు దాకా ఎంతగానో అభిమానించే వారు సైతం ఈ చర్యను తప్పు పడుతున్నారంటే ఇది ఎంతటి తప్పిదమో ఆలోచించాల్సిందే.
ఇక ఎన్టీయార్ పేరుని విజయవాడ హెల్త్ వర్శిటీ నుంచి తొలగించాలని నిర్ణయించి బిల్లు పాస్ చేసి ఆమోదించింద్ వైసీపీ సర్కార్. దీని మీద టీడీపీ రాజకీయంగా గట్టిగానే పోరాడుతోంది. తమ పార్టీ వ్యవస్థాపకుడికి ఇది తీరని అన్యాయమే అని అంటోంది. జగన్ నిర్ణయాలను కూడా తప్పుపడుతోంది.
ఇదిలా ఉంటే ఎన్టీయార్ కుటుంబం కూడా దీని మీద గట్టిగానే రియాక్ట్ అయింది. ఎన్టీయార్ కుమారుడు నందమూరి రామక్రిష్ణ పేరిట విడుదల చేసిన ఒక ప్రకటనలో ఫ్యామిలీ మొత్తం ఎన్టీయార్ పేరుని తొలగించాలని చూడడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇపుడు జూనియర్ ఎన్టీయార్ ఏమి చెబుతారు అంతా ఎదురుచూశారు.
అయితే జూనియర్ చాలా హుందాగా రియాక్ట్ అయ్యారు. ఆయన ఎవరినీ వేలెత్తి అనకపోయినా గుచ్చుకునే వారికి ఎలా గుచ్చుకోవాలో అలాగే చేశారు. ట్విట్టర్ ద్వారా తాజాగా ట్వీట్ చేస్తూ ఎన్టీయార్ కీర్తిని ఆయన తెలుగు వారి మనసుల్లో ఏర్పరచుకున్న జ్ఞాపకాలను తెలుగు జాతి ఉన్నంతవరకూ ఎవరూ చెరపలేరని జూనియర్ పేర్కొన్నారు.
అదే విధంగా తెలుగు జాతి చరిత్రలో ఎన్టీయార్ స్థానం శాశ్వతం అని కూడా పేర్కొన్నారు. ఆయన పేరుని ఒక విశ్వవిద్యాలయం నుంచి తొలగించినంతమాత్రాన ఆయన స్థాయి ఎక్కడా తగ్గదని కూడా జూనియర్ చెప్పుకొచ్చారు. అంతే కాదు ఆయన వైఎస్సార్ గురించి కూడా మంచి మాటలే చెప్పారు. ఇద్దరూ విశేషంగా తెలుగు వారి గుండెల్లో ఆదరణ సంపాదించుకున్న వారే అని గుర్తు చేశారు.
అలాంటి ఇద్దరు మహానుభావుల విషయంలో పేరు మార్పు అటూ ఇటూ కావడం మీద జూనియర్ స్పందిస్తూ దీని వల్ల వచ్చే అదనపు గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదని, అదే టైమ్ లో ఎన్టీయార్ స్థాయిని గౌరవాన్ని కూడా ఎక్కడా తగ్గించదు అని జూనియర్ చేసిన విశ్లేషణ సూపర్ గా ఉంది.
నిజంగా తాతకు తగిన మనవడుగా జూనియర్ చాలా సంస్కారవంతంగా స్పందించారు అని అంటున్నారు. చిల్లర మాటలతో విమర్శలతో ఆయన ఎవరినీ టార్గెట్ చేయకుండా తాను చెప్పదలచుకున్నది చెప్పారు. నిజంగా జూనియర్ చెప్పేది కూడా నిజం. వైఎస్సార్ కీర్తి దీని వల్ల అంగుళం కూడా పెరగదు, అలాగే ఎన్టీయార్ కీర్తి ఏ మాత్రం తగ్గదు.
ఇది ఒక విధంగా పాలకుల వింత చేష్టగానే అంతా భావిస్తారు అని భావించాలనే చెబుతారు. జూనియర్ కూడా చక్కగా తాను అనుకున్న భావాలను ట్వీట్ చేసి తాత పేరుని మరింతగా పెంచారనే అంటున్నారు. ఈ విషయంలో ఆయన ఎక్కడా రాజకీయాల జోలికి పోకుండా బాలన్స్డ్ గానే ఉన్నారని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.