మక్కాలోని ప్రవక్త పాదముద్రలను విడుదల.. వీటికోసం ఏం చేశారో తెలుసా?

Update: 2021-05-08 12:37 GMT
ఇస్లాం  పవిత్ర పుణ్యక్షేత్రం మక్కా. ప్రతి ముస్లిం అక్కడికి వెళ్లాలని అనుకుంటారు. మక్కా మసీద్ కి వెళ్తే తమ జన్మ ధన్యమైందనుకుంటారు. అలాంటి మక్కాలోని కొన్ని అరుదైన చిత్రాలను రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని సౌదీ అరేబియా ప్రభుత్వం విడుదల చేసింది. మక్కాలోని రాజమసీదులో ఉన్న మక్కా-ఏ-ఇబ్రహీంకి చెందిన చిత్రాలను విడుదల చేసింది. కొత్త సాంకేతికతో జనరల్ ప్రెసిడెన్సీ మక్కా, మదీనా అపూరూప చిత్రాలను తీసినట్లు వెల్లడించింది.

కాబా నిర్మాణం సమయంలో పని చేస్తుండగా మక్కా-ఏ-ఇబ్రహీం పాదముద్రలు ఏర్పడ్డాయని ముస్లిం పెద్దలు తెలిపారు. ఆనాటి అపురూప గుర్తులను నేటి వరకు రక్షిస్తున్నారు. వీటిని సంరక్షించడానికి బంగారం, వెండి, గాజు పూతలను ఏర్పాటు చేశారు. వీటితో అందంగా తయారు చేయడం వల్ల నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి.

ముస్లింలు హజ్ యాత్రలో భాగంగా ఈ పాద ముద్రలను దర్శించుకుంటారు. ఇలా చేస్తే తమకు స్వర్గప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. దీనినే స్వర్గ రాయి అంటారు. అందరూ కాబాలోని ఈ పాద ముద్రలను తప్పకుండా సందర్శిస్తారు. చదరపు ఆకారంలో ఈ పాద ముద్రలు ఉంటాయి. తెలుపు, నలుపు, పసుపు రంగులతో సుమారు 50సెం.మీ ఎత్తు వరకు ఉంటాయి.

రంజాన్ మాసం సందర్భంగా సౌదీ ప్రభుత్వం మే 4న ఈ అపురూప చిత్రాలను విడుదల చేసింది. నల్ల రాళ్లపై ఉన్న పాదముద్రల హై రెజల్యూషన్ చిత్రాలను తీశారు. ఈ చిత్రాలను తీయడానికి దాదాపు 7 గంటల సమయం పట్టిందని అక్కడి అధికారులు వెల్లడించారు. 49,000 మెగా పిక్సెల్ కెమెరాలతో వెయ్యి చిత్రాలను తీసినట్లు వెల్లడించారు. 
Tags:    

Similar News