24 గంటలూ షాపింగ్.. సినిమాలు..?

Update: 2016-01-05 04:49 GMT
గత కొద్దికాలంలో దేశం వివిధ రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో వస్తున్న మార్పుల్ని.. అవకాశాల్ని చేజిక్కించుకున్నదేశ ప్రజలు తమకు తాము ఎదిగేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. వ్యక్తిగతంగా వచ్చిన మార్పు.. దేశమ్మీదా ప్రభావం చూపిస్తోంది. ఇదిలా ఉంటే.. మారుతున్న ప్రజల అవసరాలు.. అభిరుచులకు తగ్గట్లుగా కేంద్రం నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. తాజాగా కేంద్ర సర్కారు ఒక అంశంపై తీవ్రంగా ఆలోచిస్తోంది. ఒకవేళ.. ఈ ఆలోచన కానీ వర్క్ వుట్ అయితే.. నగరాలు నిద్రపోయే అవకాశమే ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మహా నగరాలు.. నగరాల్లో ప్రజా జీవితంలో అనునిత్యం మార్పులకు లోనవుతున్న వేళ.. కేంద్ర సర్కారు.. దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లోని మాల్స్.. రెస్టారెంట్లు.. సినిమా థియేటర్లు 24 గంటలు తమ కార్యకలాపాలు సాగించేలా చట్టంలో మార్పులు చేయాలని భావిస్తున్నారు.

గతానికి భిన్నంగా లైఫ్ స్టైల్ మారిపోవటం.. పని వేళల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో.. రాత్రి పగలు అన్న తేడా లేకుండా అన్ని వేళల్లో పని చేసేలా నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలతో.. కార్మిక సంఘాల నాయకులతో కేంద్రం చర్చలు జరుపుతోంది. ఒకవేళ.. ఇవన్నీ సానుకూలంగా సాగి.. పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాని పక్షంలో.. ‘‘రౌండ్ ద క్లాక్’’ పని చేసే రెస్టారెంట్లు.. షాపింగ్ మాల్స్.. సినిమా థియేటర్ల కాన్సెప్ట్ ను దేశంలోని మహానగరాలు.. నగరాల్లో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News