తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరో కార్యచరణకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు కేసీఆర్‌పై ఒంటరిపోరాటం చేసిన రేవంత్ ఆ ప్రయత్నం విఫలం అవడంతో విపక్షాలను ఏకం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. 2014 ఎన్నికల తర్వాత అధికారం చేజిక్కడంతో బలపడిన టీఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి ఎవరికి వారుగా పోరాటాలు చేస్తే ఫలితం ఉండదని రేవంత్ భావిస్తున్నారు. అందుకే కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని అప్పుడే బలమైన శత్రువును దెబ్బతీసే అవకాశం ఉంటుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో త్వరలోనే కార్యచరణ మొదలుపెట్టనున్నట్లు సమాచారం.
ఇటీవల తాండూర్‌లో నిర్వహించిన సభ నుంచే కేసీఆర్ వ్యతిరేక శక్తుల ఏకీకరణ ప్రారంభిస్తామని రేవంత్ ప్రకటించారు. ప్రతిపక్షాలను పరోక్షంగా దెబ్బతీస్తూ ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ, తనకు వ్యతిరేకంగా ఆరోపణలు చేసిన జైలుకు పంపుతామని బెదిరిస్తూ తెలంగాణలో మరో ఇరవై ఏళ్లపాటు టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉండేలా వ్యూహాలు పన్నుతున్న కేసీఆర్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ను వ్యతిరేకించే అన్ని శక్తులను ఒక వేధికపైకి రావాలని రేవంత్ పలు వర్గాలను కోరుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే కాంగ్రెస్, వామపక్షాలు, కోదండరాం, బీజేపీలతో చర్చలు జరిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం గతంలో మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో ఉండేది. అయితే జిల్లాల పునర్విభజన అనంతరం కొడంగల్ నియోజకవర్గానికి చెందిన 5 మండలాలలో 3 మండలాలు వికారబాద్ జిల్లా పరిధిలోకి చేరాయి. దీంతో రేవంత్ రాజకీయ భవితవ్యంపై ఒకింత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కునేందుకు గులాబీ వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు సిద్ధమయ్యారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/