తెలంగాణీ సీఎం కేసీఆర్‌పై టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎనుముల రేవంత్ రెడ్డి మరోమారు సంచలన ఆరోపణలు చేశారు. మియాపూర్‌లోని నకిలీ భూ కుంభకోణంపై మండిపడిన రేవంత్ తెలంగాణ రాష్ట్రంలో 3 స్కామ్ లు, 6 అవినీతి పనులు అన్నట్లు పాలన సాగుతోందని ఆరోపించారు. ఎంసెట్ - నయీమ్ - మియపూర్ కుంభకోణలు ఇందులో పెద్దవి అని ఆరోపించారు. రిజిస్ట్రేషన్ ఫీజు ఎగ్గొటడమే గాక వేల కోట్ల దోపిడీ జరిగిందని, ఉప ముఖ్యమంత్రి ఆఫీస్ కావాలనే నివేదికను తొక్కిపెట్టిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
వేల కోట్ల భూముల స్కామ్ విషయంలో కొద్ది మంది కింది స్థాయి అధికారులను బలి చేసే ప్రయత్నం చేస్తూ పెద్దలు తప్పించుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మియపూర్ లో 700 ఎకరాలు 17 వేల కోట్ల రూపాయల స్కామ్‌లో కొద్దిమందిని అరెస్ట్ చేసి, కీలక సూత్రధారులు తప్పించుకునే వీలు సీఎం కేసీఆర్ కల్పించారని దుయ్యబట్టారు. గోల్డ్‌స్టోన్ ప్రసాద్ తమ్ముడు పార్థసారధి భార్య సీఎం కార్యదర్శి ఆని పేర్కొన్న రేవంత్ ఆమె సమక్షంలో కేసీఆర్ ఎలా శాఖ పరమైన సమీక్ష చేస్తారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ సమీక్షకు నిబద్ధత ఏముందని ప్రశ్నించారు. కేసీఆర్ బంధువు అయిన నమస్తే తెలంగాణ సీఎండీ దామోదర రావు ను పిలుచుకొని ఎలా సమీక్ష చేస్తారని నిలదీశారు. ఆయన ఏమైన ప్రభుత్వంలో భాగస్వామా అని ప్రశ్నించారు
సీఎం కార్యాలయం అవినీతిలో కూరుకుపోయిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ కుంభకోణంలో ఎవర్ని తప్పించి, ఎవర్ని బలి చేయదలుచుకున్నారని ప్రశ్నించారు. ఈ కేసులో సీఎం, డిప్యూటీ సీఎం కార్యాలయం సిబ్బంది పాత్రను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ ను అరెస్ట్ చేసిన పోలీస్ కమిషనర్ ను తప్పించి సీఐడీకి ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. మియపూర్ కుంభకోణం కప్పి పుచ్చుకోవడానికే కేసును ఆఘమేఘాల మీద సీబీసీఐడీకి అప్పగించారని తెలిపారు. సీఎం కార్యాలయంలో జరిగే విషయాలు గోల్డెస్టోన్ ప్రసాద్ కు తెలిసేలా ఐఏఎస్ అధికారిని నియమించుకున్నారా అని సందేహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు అవినీతి ఆరోపణలతో దళిత ఉప ముఖ్యమంత్రిని భర్తరఫ్ చేసిన సీఎం, ఇప్పుడు భూముల కుంభకోణంతో సంబంధం ఉన్న డిప్యూటి సీఎం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్రినిటి ఇన్ఫ్రా ఇంట్రవెంచర్స్ పేరుతో ఉన్న Ts10eh6666 బెంజ్ కారును ఎవరు వినియోగించారు, వాటి వివరాలు, సీసీ ఫుటేజ్ ను cbcid స్వాధీనం చేసుకుని బహిరంగ పర్చాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ బెంజ్ కారు రోజు సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లి వస్తుందని తెలిపిన రేవంత్ ఇందులో ఎవరున్నారో వారి బాగోతాన్ని బయటపెట్టాలని కోరారు.
గోల్ట్ స్టోన్ ప్రసాద్ కు, నమస్తే తెలంగాణ సీఎండీ దామోదర రావుకు మంచి సంబంధాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇద్దరు కలసి వేల కోట్ల వ్యాపారాలు చేస్తున్నారని తెలిపారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ ప్రాణాలకు ముప్పు ఉందని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వెంటనే ప్రధానమంత్రికి ఈ కుంభకోణం పై లేఖ రాయాలని డిమాండ్ చేశారు. కేంద్రం సుమోటోగా తీసుకొని సీబీఐ విచారణ జరిపించాలని సూచించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/