సీఎం కేసీఆర్ గత రెండున్నర ఏళ్ల కాలంలో తన ఫామ్ హౌస్ లో కూర్చొని రూ.2 లక్షల కోట్ల పనులకు టెండర్లు పిలవడం ద్వారా రూ.20వేల కోట్ల దాకా కమీషన్లు దండుకున్నారని తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు మిగిలిన సగం కాలాన్ని ఓట్లు దండుకోవడానికి ప్రగతి భవన్లో కూర్చొని అవసరమైన పథకాలు రచిస్తున్నారని దీనిలో భాగంగానే కులాల కుంపులాటలు మొదలుపెట్టారని విమర్శించారు. ముదిరాజులు-బెస్తల మధ్య - యాదవులు-కురమల మధ్య, మాదిగలు—మాలల మధ్య విబేధాలు సృష్టించి తాను లాభపడాలని ప్రయత్నిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఆంధ్ర బ్రాహ్మణులకు ఆడంబరం ఎక్కువ...తెలంగాణ బ్రాహ్మణులకు నిష్ట ఎక్కువ అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఆంధ్ర బ్రాహ్మణుడైన చిన్నజీయర్ స్వామిని తెలంగాణ కుల గురువుగా ప్రజల నెత్తిన రుద్దడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సినీ పరిశ్రమలో తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారని ఉద్యమం సమయంలో అందర్నిరెచ్చగొట్టి షూటింగులను కూడా అడ్డుకున్న కేసీఆర్ ఇప్పుడు సినిమాలలో ఏ మార్పు వచ్చిందని, ఏ తెలంగాణ యువకులను హీరోలుగా పెట్టారని సినీ కథా నాయకులతో అంటగాగుతున్నారని రేవంత్ ప్రశ్నించారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తానని కేసీఆర్ ప్రగతి భవన్ కట్టుకున్నారని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని తన కుటుంబంలో నలుగురికి పదవులు తెచ్చుకున్నారని, దళిత గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తానని వందల ఎకరాలలో తన ఫామ్ హౌస్‌ను కట్టుకున్నారని ఆయన విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల రీ డిజైన్లపై అనుకూల నిర్ణయం తీసుకోవడాన్ని రేవంత్ తీవ్రంగా తప్పుపట్టారు. 2015లో కొండపొచమ్మ రిజర్వాయర్ సామర్ధ్యాన్ని ఒక టీయంసీ నుంచి 21 టీఎంసీలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందని ఇప్పుడు అదే ప్రభుత్వం ఈ రిజర్వాయర్ సామర్ధ్యాన్ని 21 టీయంసీల నుంచి 7 టీఎంసీలకు కుదిస్తూ నిర్ణయం తీసుకుందని చెప్పారు. వాస్తవానికి 21 టీఎంసీల సామర్థ్యంతో కొండపొచమ్మ రిజర్వాయర్ను నిర్మిస్తే 5400 ఎకరాల భూమిని ముంపునకు గురవుతుందని అదే 7 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తే 4800 ఎకరాల భూమి మునుగుతుందని తెలిపారు. రిజర్వాయర్ సామర్థ్యాన్ని 14 టీఎంసీలు తగ్గించిన కారణంగా మిగిలేది కేవలం 600 ఎకరాల భూమి మాత్రమేనని చెప్పారు. అయితే ఈ 600 ఎకరాలలోనే ముఖ్యమంత్రి బంధువు అయిన కావేరి సీడ్స్ సంస్థకు చెందిన 265 ఎకరాల భూమి ఉందని దానిని కాపాడడం కోసమే కేసీఆర్ కొండపొచమ్మ రిజర్వాయర్ సామర్ధ్యాన్ని 21 టీఎంసీల నుంచి 7 టీఎంసీలకు తగ్గించారని రేవంత్ ఆరోపించారు. అయితే, మల్లన్నసాగర్ రిజర్వాయర్ను 50 టీయంసీల సామర్థ్యంతో కాకుండా 30 టీయంసీల సామర్థ్యంతో నిర్మించి కొండపొచమ్మ రిజర్వాయర్ను 21 టీయంసీలతో నిర్మిస్తే మల్లన్న సాగర్ కింద ముంపునకు గురయ్యే పేదల భూమి 10వేల ఎకరాల దాకా మునిగిపోకుండా ఉంటుందని రేవంత్ రెడ్డి వివరించారు.
తన బంధువుకు చెందిన భూమిని కాపాడడం కోసం పేదలకు చెందిన 10 వేల ఎకరాల భూమిని ముంచడానికి, మల్లన్న సాగర్ ప్రాజెక్టును అధిక వ్యయంతో నిర్మించడం ద్వారా రూ. 3500 కోట్ల అదనపు వ్యయం భరించడానికి కూడా కేసీఆర్ ఆమోద ముద్ర వేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులలో ఎలాంటి అవినీతి అవకతవకలు లేకపోతే ఆ ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్లను బహిరంగపర్చాలని, తెలంగాణ మేధావులను పిలిచి చర్చకు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎప్పుడు పిలిచినా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. డీపీఆర్ లు బయటపెట్టకపోవడానికి అదేమైన దేశ రక్షణకు సంబంధించిన రహస్య అంశమా అని రేవంత్ సూటిగా ప్రశ్నించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/