తెలంగాణ సీఎం కేసీఆర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావులపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మామా.. అల్లుళ్లు.. మహిళా హంతకులు.. అని ఆయన నిప్పులు చెరిగారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత.. నలుగురు మహిళలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై స్పందించిన రేవంత్.. తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు.
ఇబ్రహీంపట్నం ఘటనను కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకొని పనిచేయాలని రేవంత్ అన్నారు. తాజాగా మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ... మహిళల మృతి ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌కు పిర్యాదు చేయాలని పార్టీ నేతలను రేవంత్ ఆదేశించినట్టు చెప్పారు. హెల్త్ మినిస్టర్ హరీష్ రావు ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
మామ అల్లుళ్ళు మహిళా హంతకులు అంటూ కేసీఆర్ , హరీష్‌రావును ఉద్దేశిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చనిపోయిన మహిళా కుటుంబాలను హరీష్‌రావు పరామర్శించాలని రేవంత్ డిమాండ్ చేశారు.
ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు. తూతూ మంత్రంగా అధికారిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవద్ద ని, వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
నిప్పులు చెరిగిన బీజేపీ
ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నలుగురు మహిళల మృతి చెందడానికి కేసీఆర్ సర్కార్ మూర్ఖత్వమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిప్పులు చెరిగారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను బండి సంజయ్ తాజాగా పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
మంత్రి హరీష్ రావు తీరుపై బండి మండిపడ్డారు. బాధితులను పరామర్శించకుండా సీఎం బీహార్ వెళ్ళటం దుర్మార్గపు చర్య అని అన్నారు. తెలంగాణలోని పేదలను వదిలేసి పంజాబ్, బీహార్‌లో డబ్బులు పంచటం అన్యాయమన్నారు. చనిపోయిన మహిళల పిల్లల చదువు, భవిష్యత్తు బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.