తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోమారు ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో టీఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై జరిగిన ప్రజాపోరు బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని టీఆర్ ఎస్ నెరవేర్చలేదని - హామీలు అమలు కోసం ప్రభుత్వం మెడలు వంచేందుకు తెలుగుదేశం పార్టీ ప్రజా పోరు యాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అరచేతిలో వైకుంఠం చూపిన కేసీఆర్ అధికారంలోకి రాగానే హామీలను విస్మరించి ప్రజలను నట్టేట ముంచారన్నారు. డబ్బా ఇళ్లు కాదని - డబుల్ బెడ్ రూంల ఇళ్లు కడతామని చెప్పి 950 ఇళ్లు మాత్రమే కట్టారన్నారు. కేసీఆర్ ను కనిపెంచిన చింతమడకలో సైతం ఒక్క డబుల్ బెడ్‌రూం ఇల్లు నిర్మించలేదన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీల అమలు - బంగారు తెలంగాణ సాధనపై సీఎం సొంత గ్రామమైన చింతమడకలోనైనా - తెలంగాణ సిద్దాంతకర్త జయశంకర్ స్వగ్రామంలోనైనా బహిరంగ చర్చకు సిద్ధమేనన్నారు. జయశంకర్ నివాసం ఉన్న ఇంటిని లైబ్రరీగా మార్చుతానని ఇచ్చిన హామీని విస్మరించారన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమత్రిగా కాకుండా ఎర్రవెల్లి గ్రామానికి సర్పంచ్ గా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్నదాతల ఆత్మహత్యల్లో రాష్ట్రం రెండోస్థానంలో నిలిచిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పిన సీఎం కసీఆర్...బొందల గడ్డగా మార్చారని విమర్శించారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను మూడేళ్ల కేసీఆర్ పాలనలో 1.07 లక్షల అప్పుల రాష్ట్రంగా మార్చారని దుయ్యపట్టారు. దళితులకు 3ఎకరాల భూ పంపిణీపై నిధులున్నా భూమి దొరకడం లేదని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వెల్లడించాడన్నారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పిన కేసీఆర్ మూడు బడ్జెట్ లు ప్రవేశపెట్టినా ఇంతవరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పంట నష్ట పరిహారం - 793 కోట్ల ఇన్ ఫుట్ సబ్సిడీ కేటాయిస్తే రైతులకు చెల్లించకుండా వాటర్ గ్రిడ్ బిల్లుల చెల్లింపుకు మళ్లించడం దారుణమన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోని నాయకులు ఓట్ల కోసం వస్తే నిలదీయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు ప్రజలతో మమేకమై టీడీపీ పోరాటాలు చేస్తుందన్నారు. బంగారు తెలంగాణ ఏమోగాని కేసీఆర్ కుటుంబానికి మాత్రం బంగారంగా మారిందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. అధికారం - ఉద్యోగాలు అన్ని వారికే వచ్చాయి కాని పేదలకు మాత్రం ఏమీ రాలేదన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/