రేవంత్ అధికారంలోకి రాగానే ఆ ప‌ని చేసేస్తాడ‌ట‌

Update: 2017-05-30 11:55 GMT
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై మండిప‌డ్డారు. తెలంగాణ‌లో అమ‌ర‌వీరుల‌కు, తెలంగాణ‌వాదుల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని తెలిపారు. మీట్ ది ప్రెస్‌ లో భాగంగా మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి రాగానే మొదటగా తెలంగాణ అధికారిక ముద్ర మారుస్తాన‌ని ప్ర‌క‌టించారు. TS అని ఉన‌్న వాహ‌నాల నెంబర్ ప్లేట్ లను TG గా మారుస్తాన‌ని తెలిపారు. దీంతోపాటుగా కేసీఆర్ విస్మ‌రించిన మ‌రిన్ని అంశాల‌పై దృష్టి పెట్టనున్న‌ట్లు తెలిపారు.

తెలంగాణ ఏర్పడి 1100 రోజులైనా ఇప్పటికీ తెలంగాణ అమర వీరుల విగ్రహం ఏర్పాటుకు కేసీఆర్ పూనుకోలేదని రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రిని దళితుణ్ణి చేస్తా అని కేసీఆర్ మోసం చేశార‌ని ఆరోపించారు. తెరాస కేసీఆర్ పాలనా స్వార్ధ రాజీకీయాల కోసమే త‌ప్ప సంక్షేమం కోసం కాదని విమ‌ర్శించారు. త్యాగాలు చేసిన వారు శ్మ‌శానానికి పోతుంటే...తెలంగాణద్రోహులను మంత్రి వర్గం చేర్చుకున్నారు అని దుయ్య‌బ‌ట్టారు. హుస్సేన్‌ సాగర్‌ లో బుద్ధుడి విగ్రహం పక్కన అమరవీరుల శిలాక్షరాలతో స్మారకచిహ్నం ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.  బ్లూ క్రాస్ సొసైటీ కుక్కలా అరుపులకు అక్కడి కాల‌నీ వాళ్ళు ఖాళీ చేస్తున్నారని అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం బ్లూక్లాస్ సంస్థ‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తోంద‌ని తెలిపారు. తెలంగాణ స‌ర్కారుకు పిచ్చి కుక్కల విష‌యంలో ఉన్న పట్టింపు అమరుల కుటుంబాలకు లేదా  కేసీఆర్ అని ప్ర‌శ్నించారు.

పార్టీ ఫిరాయించిన తెలంగాణ వ్య‌తిరేకులైన‌ తుమ్మల లాంటి వాళ్లకు ఎమ్మెల్సీ ఇచ్చిన కేసీఆర్ అదే రీతిలో అమ‌రుడైన‌ శ్రీకాంత్‌ చారి తల్లికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పద‌వి ఇచ్చుంటే సంతోషించే వాళ్ళమ‌ని రేవంత్ రెడ్డి అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఆంధ్ర కార్పొరేటర్ లకు ఇచ్చిన కేసీఆర్...తెలంగాణ‌లోని పాలమూరు బిడ్డలకు ఒక్కరికి కూడా ఇవ్వలేదని మండిప‌డ్డారు. ఆంధ్ర వాళ్ళను ఇక్కడ చైర్మన్లుగా , అలంటి పదవులు ఇస్తున్నారని ఆక్షేపించారు. యాదాద్రి - భద్రాద్రి లాంటి పేర్లు అంత ఆంధ్రా పేర్లని రేవంత్ తెలిపారు. అలాంటి పేర్లు ఇక్కడ గుట్టలు అనిపిలిచే వాటికి పెట్టిన ఘ‌నత కేసీఆర్‌ ద‌ని ఎద్దేవా చేశారు. ప్రజలు త‌న‌ను ఆదరించినట్లు నిన్ను అద‌రించడంలేదు కేసీఆర్ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News