తెలంగాణలో ఇంటర్మీడియ్ బోర్డు నిర్లక్ష్యం కారణంగా రేకెత్తిన పెను వివాదం ఇప్పడు మాటల మంటలను రేపుతోంది. ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగా పరీక్షల్లో పాసవుతామనుకున్న విద్యార్థులు ఫెయిల్ అవడంతో తీవ్ర మనోవేదనకు గురై 23 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అప్పటిదాకా కుక్కిన పేనుల్లా ఉన్న విపక్షాలన్నీ ఒక్కసారిగా జూలు విదిల్చాయి. ఇంటర్ బోర్డు తప్పు చేస్తే... దానిపై చర్యలు తీసుకోవడంతో పాటుగా ఆత్మహత్యలు నివారించేలా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన కేసీఆర్ సర్కారు... దాదాపుగా ఐదు రోజుల పాటు అసలు స్పందించనే లేదు. ఈ నేపథ్యంలో విపక్షాలన్నీ విద్యార్థుల\కు బాసటగా నిలిచాయి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై రోడ్డెక్కాయి. ఈ క్రమంలో మాటల తూటాలు పేలాయి. అయితే విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించడానికి అంత ఆసక్తి చూపని అధికార పక్షం... విపక్షాల నుంచి దూసుకువచ్చిన మాటల తూటాలకు మాత్రం పదునైన కౌంటర్లు సంధించింది.
ఈ క్రమంలో కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యాన్ని కడిగిపారేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హన్మంతరావుపై కేటీఆర్ తనదైన శైలిలో విరుచుకుపడి... సీనియర్ నేత అని కూడా కూడా చూడకుండా... బఫూన్ అంటూ సంచలన కామెంట్ సంధించారు. అయితే కాంగ్రెస్ నేతలు తక్కువేమీ తినలేదు కదా. తమ పార్టీకి చెందిన సీనియర్ నేతను బఫూన్ అన్న మీరు కుర్రకుంకే కదా అంటూ ఘాటుగానే బదులిచ్చింది. మొత్తంగా ఇంటర్ వివాదం ఇప్పుడు నేతల మధ్య మాటల మంటలకు తెర లేపిందన్న మాట. అయినా కేటీఆర్ ను కుర్రకుంక అంటూ సంబోధించిన నేత ఎవరో తెలుసా? అంత దమ్మూ ధైర్మం ఉన్న నేత రేవంత్ రెడ్డే కదా. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని అడిగితే.. కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీహెచ్‌ను బఫూన్ అంటూ ఆ కుర్రకుంక మాట్లాడటం సరికాదని రేవంత్ సంచలన వ్యాఖ్య చేశారు. కేటీఆర్ మాటలను బట్టి చూస్తే.. రాష్ట్రంలో ఎంతటి బలుపు పాలన కొనసాగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా రేవంత్ తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బలుపు పాలన సాగిస్తున్నందుకే వారికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని కూడా రేవంత్ వ్యాఖ్యానించారు.
ఇంటర్మీడియట్ ఫలితాల తప్పిదాలపై గాంధీభవన్ దగ్గర పార్టీ అనుబంధ సంఘాలు... యూత్ కాంగ్రెస్ విభాగం, ఎన్ ఎస్ యూఐ నేతలు 48 గంటల నిరసన దీక్ష చేపట్టారు. వారికి మద్దతు తెలిపిన సందర్భంగా రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంటర్ ఫలితాల తప్పుల తడకపై అటు తండ్రి కేసీఆర్ గానీ - ఇటు కొడుకు కేటీఆర్ గానీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇద్దరు కలిసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని రేవంత్ మండిపడ్డారు. 20 ఏళ్ల నుంచి ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థను తప్పించి గ్లోబరీనా సంస్థకు టెండర్ ఇవ్వడంలో ఆంతర్యమేంటని ఆయన ధ్వజమెత్తారు. కేటీఆర్ స్నేహితుడి మామకు చెందిన మాగ్నటిక్ ఇన్ఫోటెక్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదని రేవంత్ ప్రశ్నించారు. మొత్తంగా వీహెచ్ పై కేటీఆర్, కేటీఆర్ పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మాటల మంటలు రేగాయనే చెప్పాలి.