తెలంగాణ అధికారపక్షంపై వన్ సైడెడ్ గా విరుచుకుపడే సత్తా ఉన్న విపక్ష నేతలు కాస్త తక్కువ మందే ఉన్నారని చెప్పాలి. అలాంటి వారిలో టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి మొదటివరుసలోనే ఉంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరి పిట్టకథలు చెప్పి మాటలతో మంట పుట్టించే టాలెంట్ రేవంత్ కు ఎక్కువే.
గతంలో కేసీఆర్ పైనే ఒంటికాలి మీద లేచి కస్సుమనే రేవంత్‌ను ఆరాధనగా చూసే వాళ్లలో చాలామంది ఓటుకు నోటుకేసు తర్వాత నుంచి కాస్త ఆరాధన భావం తగ్గిందనే చెప్పాలి. నిజానికి ఇది రాజకీయాల్లో మామూలే కానీ రేవంత్ దొరికాడు. మాటల వరకూ కేసీఆర్ కు పంచ్ లు వేస్తున్నా.. ప్రజల్లో ఆయనకున్న ఇమేజ్ విషయంలోనే ఇబ్బంది అంతా.
ఇదిలా ఉంటే.. ఈ మధ్య కాలంలో రేవంత్ కొత్త పాట అందుకున్నారు. తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే.. వాహన రిజిస్ట్రేషన్లలో టీఎస్ స్థానం నుంచి టీజీని తీసుకొస్తామన్నారు. రాజముద్రను కూడా మార్చేస్తామంటున్నారు. తాము తీసుకొచ్చే రాజముద్రలో అమరవీరుల స్థూపం ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణ ఏర్పాటై మూడేళ్లు అవుతున్నా.. అమరవీరుల స్థూపానికి కేసీఆర్ ఇంతవరకు కొబ్బరికాయ కొట్టలేదని.. అమరవీరుల కుటుంబాల కోసం బడ్జెట్ లో ఒక్కశాతం నిధులు కూడా పెట్టలేదన్నారు. అమరవీరులు.. వారి సంక్షేమం లాంటి అంశాల్ని ప్రస్తావిస్తే బాగానే ఉంటుంది కానీ.. రాజముద్ర మార్చేస్తాం.. రిజిస్ట్రేషన్ల అక్షరాలు మారుస్తాం లాంటి వ్యాఖ్యల వల్ల మార్పు సంగతి తర్వాత.. ప్రజలు మరింత కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉందన్న విషయాన్ని రేవంత్ గుర్తిస్తే మంచిది. ప్రజలు కోరుకునేది మారుస్తానని చెప్పాలే కానీ.. నేతలకు నచ్చింది మారుస్తానంటే ప్రజల నుంచి వచ్చే స్పందనపై సందేహాలు రావటం ఖాయం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/