కాంగ్రెస్‌ లో చేరిక‌..ఆ వార్త‌ల‌ను ఖండిస్తున్నాఃరేవంత్‌

Update: 2017-10-22 17:52 GMT
గ‌త నాలుగు అయిదు రోజులుగా తెలుగు మీడియాలో తీవ్రంగా చ‌ర్చనీయాంశంగా మారిన తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మ‌రో సూప‌ర్ ట్విస్ట్ ఇచ్చారు. రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నార‌ని...ఇప్ప‌టికే ఆ పార్టీ జాతీయ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని...ఈ మేర‌కు త‌న‌తో పాటుగా పార్టీ మారేవారి పేర్ల‌ను ప్ర‌స్తావిస్తూ ఓ జాబితాను కూడా రాహుల్ గాంధీకి ఇచ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న స‌మ‌యంలో మ‌రో ట్విస్ట్ ఇచ్చారు. పత్రికల్లో తనపై వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.

త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గమైన కొడంగ‌ల్‌ లో అనుచ‌రుల‌తో స‌మావేశం నిర్వ‌హించిన అనంత‌రం రేవంత్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు. పేదల కోసం పోరాడి గుర్తింపు తెచ్చుకున్న త‌న‌పై - తెలుగుదేశం పార్టీ నాయకుల పై వస్తున్న వార్తలు కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నాయని మీడియాపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. త‌మ‌పై, త‌మ‌ పార్టీ నాయకులపై వస్తున్న వార్తలను కూడా ఖండిస్తున్నాని తెలిపారు.రాజకీయం అనేది రహస్యం కాదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. త‌మ‌ అధినేత మాట్లాడాడు పొత్తులు అనేవి ఎన్నికల ముందు తీసుకోవాల్సినవని వివ‌రించారు. ప్రజలకు సేవచేయడమే రాజకీయమ‌ని...ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఈనెల 26వతేదీన టీడీఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నట్లు - అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తామని రేవంత్ రెడ్డి వివ‌రించారు.  అసెంబ్లీలో ప్రజాసమస్యలను లెవనేతే అంశం పై దృష్టి పెట్టిన‌ట్లు చెప్పారు. అసెంబ్లీలో రైతు రుణమాఫీ - ఫీజు రీయబ‌ర్స్‌ మెంట్ - గిరిజన ముస్లిం రిజర్వేషన్ల - ఇతర ప్రజా సమస్యలను లెవనెత్తుతాని రేవంత్ రెడ్డి అన్నారు.
Tags:    

Similar News