మాటకు మాట చెప్పే నేతలకు తెలంగాణ రాష్ట్రంలో కొదవ లేదనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ లాంటి మాటల మాంత్రికుడి కారణగా..చాలామంది నేతల మాటల బలం పెద్దగా ఫోకస్ కావటం లేదనే చెప్పాలి. ఏపీ నేతలతో పోలిస్తే.. తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతల వాగ్దాటి ఎక్కువనే చెప్పాలి. ఇష్యూల మీద వారు వినిపించే వాదనను.. ఏపీ నేతల చేసే వాదనతో పోల్చి చూస్తే..విషయం ఇట్టే అర్థమైపోతుంది.
తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సభలో మాట్లాడుతూ..తాను కానీ తప్పు చేసినట్లు..గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు ఆడినట్లుగా రుజువు చేస్తే.. ఐదు నిమిషాల్లో రాజ్ భవన్ కు వెళ్లి తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన వైనం తెలిసిందే. ఆవేశంతో ఉన్నప్పుడు కాస్త ఎక్కువ తక్కువలు మామూలే. ఇక.. తాము చేసేదంతా రైటేనని బలంగా నమ్మే కేసీఆర్ లాంటి వారు.. తామెంత సత్యవంతులమన్న విషయాన్ని చెప్పుకునేందుకు విపరీతంగా ప్రయత్నిస్తుంటారు. ఇందుకు కేసీఆర్ మినహాయింపు కాదని చెప్పక తప్పదు. కొన్నివిషయాల మీద అదే పనిగా గొప్పలు చెప్పుకునే కేసీఆర్..తమ లోపాల్ని చెప్పుకోవటానికి మాత్రం ఎంతమాత్రం ఇష్టపడరనే చెప్పాలి.
రాజీనామా మీద కేసీఆర్ చేసిన సవాలుపై తెలంగాణ టీడీపీ శాసనసభాపక్షనేత రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు..అతిశయోక్తులు ఉన్నట్లు చెబితే తాను ఐదు నిమిషాల్లో రాజీనామా చేస్తానని కేసీఆర్ విసిరిన సవాలుపై స్పందించిన రేవంత్.. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన అబద్ధాల లిస్ట్ ను రెడీ చేశారు. గవర్నర్ చేత చెప్పించిన మాటల్లో అసత్యాల్ని ఆయన చెప్పుకొచ్చారు.
తాజాగా గవర్నర్ చేసిన ప్రసంగ పాఠంతో పాటు.. గడిచిన మూడేళ్ల కాలంలో గవర్నర్ చేసిన ప్రసంగ పాఠాల్ని తీసుకొచ్చిన రేవంత్..ఎన్ని అబద్ధాలు చెప్పారో చెప్పుకొచ్చారు. 2014గవర్నర్ ప్రసంగంలో అమరవీరుల కుటుంబాలకు రూ.10లక్షల ఆర్థిక సాయం..డబుల్ బెడ్రూం ఇల్లు.. ప్రభుత్వ ఉద్యోగం.. భూమి ఇస్తానని చెప్పారని.. కానీ.. ఇప్పటివరకూ ఆ హామీని నెరవేర్చలేదని రేవంత్ గుర్తు చేశారు.
తెలంగాణ ఉద్యమం సందర్భంగా తొలి.. మలి ఉద్యమాల్లో మొత్తం1569 మంది అమరులు అయ్యారని కేసీఆర్ పదే పదే చెప్పారని..కానీ. ఇప్పటివరకూ 500 కుటుంబాలకు మాత్రమే గుర్తించి ఆర్థికసాయాన్నిఅందించారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎస్సీల సమగ్రాభివృద్ధి కోసం రూ.50వేల కోట్లను కేటాయిస్తామని ప్రకటించి..కేవలం రూ.3వేల కోట్లను కూడా కేటాయించలేదని చెప్పారు. ఈ విధంగా కేసీఆర్ చేసిన తప్పుల చిట్టాను చెప్పుకొచ్చిన రేవంత్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/