కేసీఆర్ ను విమ‌ర్శ‌ల‌తో ఉతికేసిన రేవంత్‌

Update: 2017-10-08 05:19 GMT
ముల్లుకు ముల్లు.. వ‌జ్రానికి వ‌జ్రం.. మాట‌కు మాటే స‌మాధానం అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ పొలిటిక‌ల్ జేఏసీ ఛైర్మ‌న్ కోదండ‌రామ్‌ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌టం తెలిసిందే. వాడు.. వీడు.. లంగాగాడు అంటూ వెనుకా ముందు చూసుకోకుండా ఎంత మాట అంటే అంత మాట అనేసిన కేసీఆర్ పై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు రేవంత్‌.

కేసీఆర్ ఏ రీతిలో అయితే విరుచుకుప‌డ్డారో..అందుకు ఎంత‌మాత్రం త‌గ్గ‌ని రీతిలో రేవంత్ మాట‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం. కోదండ‌రాంను ఉద్దేశించి కేసీఆర్ అన్న ప్ర‌తి మాట‌కు దాదాపుగా కౌంట‌ర్ ఇచ్చిన‌ట్లుగా రేవంత్ మాట‌లు ఉన్నాయి. ఇటీవ‌ల కాలంలో సీఎం కేసీఆర్‌ ను ఉద్దేశించి ఇంత తీవ్ర‌స్థాయిలో మండిప‌డిన నేత మ‌రొక‌రు లేర‌నే చెప్పాలి. బ‌రితెగింపున‌కు ప‌రాకాష్ఠ‌గా ఉన్న కేసీఆర్ వ్యాఖ్య‌ల్ని ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల్ని ఆయ‌న మాట‌ల్లోనే చూస్తే..

+  "కోదండరాం మంచి - చెడు చెబుతారు. నచ్చితే పాటించు. లేకపోతే లేదు.. అంతేగానీ వాడూ..వీడూ అని తిట్టాల్సినంత అవసరం ఉందా?’ ఐదేళ్లకు ఎన్నికైన - మధ్యలో ఏమీ అడగొద్దని దబాయిస్తున్నవ్‌.  2001 నుంచి 2004 వరకు కాంగ్రెస్ ను  తిట్టి, తర్వాత సోనియా కాళ్లు పట్టుకుని కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని 26 అసెంబ్లీ - 5 పార్లమెంటు స్థానాలు గెలిచి రాజకీయ మనుడగ మొదలెట్టావు. తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అయిన వైఎస్‌ మంత్రి వర్గంలో అరడజను మంత్రి పదవులు తీసుకున్నవ్‌. మీ పార్టీ కేంద్రంలో - రాష్ట్రంలో మంత్రి పదవులు వెలగ‌ బెడుతున్నపుడే పోలవరం - పులిచింతల - పోతిరెడ్డిపాటు ప్రాజెక్టులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుమతిచ్చింది. పులిచింతల కడితే రక్తం ఏరులై పారుతదని ఆనాడు అన్నది వాస్తవం కాదా? అదే పులిచింతల ప్రాజెక్టు పవర్‌ ప్రాజెక్టును నేనే ఎలగబెట్టిన అని చెప్పింది నువ్వు కాదా?"

+  "నువ్వు వాడూ - వీడూ అంటే నిన్నెవరూ అనరా? పెద్ద మొనగాడివా? కేసీఆర్‌ తలకాయలేనోడు. రాష్ట్రానికి సీఎం ఎలా అయ్యిండా అని నేను ఆశ్చర్యపోయిన. ప్రొఫెసర్‌ గా పనిచేసే వాళ్లెవరయినా సర్పంచిగా నిలబడతరా? ప్రభుత్వ ఉద్యోగి ఎవరన్న నిలబడతరా? ఉద్యమం ముసుగులో బ్లాక్‌ మెయిల్‌ చేసుకుని వసూళ్లు చేసుకుని టీవీలు పెట్టుకుని, పేపర్లు పెట్టుకుని గడీలు - ఫాంహౌజ్‌ లు నిర్మించుకుని గలీజ్‌ దందాలు చేసే నీలాంటోడు చేస్తడు గని - పిల్లలకు చదువు చెప్పే సారు సర్పంచిగా పోయి నిలబడతరా? నీకంత బలుపా? అంత కండకావరమా?’’

+  "కేసీఆర్‌ - జానారెడ్డి ఇంటికి ఎందుకు వెళ్లి జేఏసీకి కోదండరాంను ఛైర్మన్‌ ను చేశారు. ఓయూ విద్యార్థుల త్యాగాల వల్ల తెలంగాణ ఉద్యమంలో - రాష్ట్ర ఏర్పాటులో కదలిక వచ్చింది. ఆ కదలికలో భాగమే డిసెంబరు 9 - 2009 ప్రకటన. నిన్ను నమ్మి ఢిల్లీవోళ్లు తెలంగాణ ఇచ్చి ఉంటే, పొలిటికల్‌ జేఏసీ పెట్టాల్సిన అవసరమేమొచ్చింది?’’

+  ‘‘ఎన్నికల్లో గెలవడమే గొప్పయితే మహాత్మాగాంధీ ఏ ఎన్నికల్లో గెలిచిండు? 2004లో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుని దాన్ని మోసం చేస్తివి. 2009లో మా కాళ్లు పట్టుకుంటివి. 2014లో సోనియా ఇంటికి వెళ్లి కడుపులో తలకాయ పెట్టి పార్టీని కలిపేస్తనని ఫోటో దిగొచ్చిన నువ్వు వీపులో కత్తితో పొడిస్తివి. ఇప్పుడు సీబీఐ కేసుల నుంచి తప్పించుకోవడానికి మోదీ ముందు మోకరిల్లి, ఆయన్ను పొడవడానికి పన్నాగం పన్నుతున్నది నువ్వుకాదా?’’

+  "ఉద్యమ స్ఫూర్తికి ప్రతీక అయిన కోదండరాంను పట్టుకుని వాడు..వీడు.. అంటరా? సింగరేణి ఎన్నికల్లో నీకు ఓటు వేయవద్దని కోదండరాం అన్నది నిజం. 23,500 ఓట్లు నీకొస్తే, ప్రతిపక్షాలకు 26,500 ఓట్లు వచ్చినయి. 45 శాతం ఓట్లు నీకు వస్తే, ప్రతిపక్షాలకు 55 శాతం ఓట్లు వచ్చినయి. మాలో ఐక్యత లేకనే నువ్వు బతికి బయటపడ్డవు తప్ప, నువ్వో సిపాయివని చెప్పి ఓట్లేసి గెలిపించిండ్రా? కోదండరాం చాలా చిన్నోడు అన్నరు.. గంత చిన్నోడి గురించి ఇంత గొంతు ఎందుకు చించుకుంటున్నవు?"

+  ‘‘తుమ్మల ఎవరు? పోచారం ఎవరు? కడియం ఎవరు? ఇంద్రకరణ్‌ ఎవరు? ఎన్నడన్న వీళ్లు జై తెలంగాణ అన్నరా?వీళ్లకు పదవులిచ్చిన కేసీఆర్‌ కు శంకరమ్మకు ప్రచారం చేయలేదని కోదండను విమర్శించే అర్హత ఉందా? అమరుల కుటుంబాలకు రూ.10 లక్షల సాయం - పదెకరాల భూమి - డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు - తల్లిదండ్రులకు వైద్య సౌకర్యం కల్పించాలని మొట్టమొదటి శాసనసభలో తీర్మానం చేసినం. 40 నెలలు గడిచాయి. గుర్తించిన 500 మందిలో ఎంత మందికి ఇల్లిచ్చినవ్‌? తెలంగాణ బిడ్డవని తెలంగాణ సమాజం ముందు నిరూపించుకోవాలంటే నల్గొండలో శ్రీకాంతచారి తల్లి శంకరమ్మను ఏకగ్రీవం చేద్దాం’’
Tags:    

Similar News