తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ - ఆయన కుటుంబంపై విమర్శలు చేయడంలో ముందుండే తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్య నిర్వాహాక అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డికి ఊహించని పరాభవం ఎదురైంది. అది కూడా సాక్షాత్తు కేసీఆర్ సొంత గ్రామంలోనే కావడం ఆసక్తికరం. కేసీఆర్ స్వగ్రామం చింతమడకకు చెందిన ఓ రైతు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు రేవంత్ రెడ్డి చింతమడక గ్రామానికి వెళ్లారు. అయితే...రేవంత్ రెడ్డి పర్యటనను నిరసిస్తూ గ్రామస్తులు నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి గో బ్యాక్ అంటూ వారు నినాదాలు చేయడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
కాగా, ఇదే సమయంలో చింతమడకలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాన్వాయ్ ను టీఆర్ ఎస్ కార్యకర్తలు ఆపేశారు. దీంతో రేవంత్ మరో వాహనంలో వెళ్లారు. సీతారాంపురం దగ్గర మళ్లీ వాహనాన్ని ఆపడంతో రేవంత్ కాలినడకనే వెళ్లిపోయాడు. కాగా చింతమడక వెళ్లేందుకు రేవంత్‌రెడ్డి, పలువురు టీడీపీ కార్యకర్తలు సిద్దిపేటకు చేరుకోగా ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు ముందే అడ్డుకుని కేవలం 20 మందికి మాత్రమే అనుమతించారు. అనంతరం గ్రామంలోకి వెళ్లిన రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగాస్థానికులు గో బ్యాక్ నినాదాలు చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/