ఒకటి రెండు వజ్రాలు పొదిగించి ఉంగరాలు చేయిస్తేనే..వాటివిలువ రూ.కోట్లలో పలుకుతోంది. మరి అలాంటిది ఒక్క ఉంగరంలో 7, 801 వజ్రాలు పొదిగించడం అంటే మాటలా.. ఉంగరంలో అన్ని వజ్రాలు పొందుపరిచారంటే ఎంత నైపుణ్యం ఉండాలి. ఎన్ని రోజులు కష్టపడాలి. మామూలుగానే వజ్రాలకు మెరిసే అందం సొంతం. మరి ఒక్క ఆభరణాన్ని అన్ని వేల ఉంగరాలను పొదిగించి చేయిస్తే మెరిసే ఆ అందాన్ని పొగడకుండా ఉండగలమా.. అందుకే ఆ ఉంగరం గిన్నీస్ రికార్డుల్లోనూ చోటు సంపాదించుకుంది. ఇంతకీ ఈ ఉగరం తయారైంది ఎక్కడో కాదు. మన ఇండియాలోనే. వజ్రాలకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ లో ఈ ఉంగరాన్ని తయారు చేశారు.
ఈ ఉంగరాన్ని కమలం ఆకారంలో రూపొందించారు. ఈ ఉంగరం తయారీకి ప్రత్యేక నిపుణులు చాలా సమయం తీసుకున్నారు. చూడచక్కగా మలిచారు. ఈ బ్రహ్మ వజ్ర కమలం ఉంగరాన్ని ప్రస్తుతం ఆన్లైన్లో వేలం వేయబోతున్నారు. బిడ్డర్ల కోసం దీని విలువను రూ. 78.01 లక్షలుగా నిర్ణయించారు. వేలం కోసం ఈ నెల 13 నుంచి 22 వ తేదీ వరకు దీన్ని ఆన్‌లైన్ లో ప్రదర్శిస్తారు. సోమవారం నుంచి బిడ్డింగ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. వేలంలో పాల్గొనదలచిన వారు www.thedivine7801.com వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. మరోవైపు వచ్చిన మొత్తంలో 10 శాతాన్ని పీఎం కేర్ ఫండ్‌కు ఇస్తామని నిర్వాహకులు ప్రకటించారు.