డాక్టర్ల కంటే వేగంగా ఆపరేషన్ చేసిన రోబో

Update: 2015-11-21 08:47 GMT
ఆధునిక యుగంలో రోబోలు అన్ని పనులూ చేసేస్తున్నాయి. తాజాగా వైద్యరంగంలోనూ.. అది కూడా శస్త్రచికిత్సలు కూడా చేస్తున్నాయి. తాజాగా చైనాలోని గాంగ్‌ డాంగ్‌ ప్రావిన్స్‌ లో రోబో ఒకటి ఆరేళ్ల బాలుడికి కిడ్నీ శస్త్రచికిత్స చేసిందని చైనా మీడియా అనౌన్స్ చేసింది. అంతేకాదు... శస్త్రచికిత్స నిపుణులు మూడున్నర గంటల సమయంలో చేసే ఈ ఆపరేషన్ ను రోబో కేవలం రెండున్నర గంటల్లోనే పూర్తిచేయడం విశేషం.

చైనాలోని గాంగ్‌ జౌ నగరంలోని సన్‌ యెట్‌ సేన్‌ విశ్వవిద్యాలయానికి మొట్టమొదటి అనుబంధ హాస్పిటల్‌ లో నవంబర్‌ 16న ఈ ఆపరేషన్‌ దిగ్విజయంగా జరిగిందని చైనాలోని పీపుల్స్‌ డైలీ పత్రిక వెల్లడించింది. రోబో ఇలా కిడ్నీ ఆపరేషన్ చేయడం ఇదే ప్రథమమని చెబుతున్నారు.  ఆ బాలుడికి ఎడమ కిడ్నీ పనిచేయడం మానేయడంతో మూత్ర విసర్జన ఆగిపోయి విపరీతంగా వాచిపోయింది. దీంతో శస్త్రచికత్స తప్పనిసరని వైద్యులు గుర్తించారు.. రోబోను ఉపయోగించి డావిన్సి పద్ధతిలో శస్త్రచికిత్స చేయాలని నిశ్చయించారు. ఇందుకోసం రోబోకు మొత్తం విధానాన్ని ఫీడ్ చేసి ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లారు. అయితే.. శస్త్రచికిత్స జరుగుతున్నంత సేపూ సర్జన్‌ అక్కడే ఉండి నిశితంగా గమనించారు. ఈ శస్త్రచికిత్స రెండు గంటల 20 నిమిషాల పాటు జరిగింది. సాధారణ లాప్రోస్కోపిక్‌ శస్త్రచికిత్సకు అంతకంటే గంట సమయం ఎక్కువ తీసుకుంటుంది.
Tags:    

Similar News